Jump to content

come

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, వచ్చు ట, చేరుట, సంభవించుట, తగులుట.

  • come what will I will do this యెట్లా అయినా సరే నేను చేస్తాను.
  • when the butter comes వెన్నపడేటప్పుడు.
  • Come ! మంచిది, సరి Come ! Come ! సరేసరే, మెట్టుకు.
  • Come ! whats the use of doing so ? మంచిది దానివల్ల యేమి ప్రయోజనము.
  • Come ! you are wrong మెట్టుకు తప్పినావు.
  • Come ! you must obey సరే నీవు అట్లా చేయవలె.
  • Come ! tell me మంచిదిచెప్పు.
  • to come across అడ్డము తగులుట, అడ్డము వచ్చుట.
  • to come ashore గట్టుకు తట్టుట.
  • the rope come as under తాడు తెగినది, మెలి వీడిపోయినది.
  • to come at అందుట, దొరుకుట, చిక్కుట.
  • I could not come at it అది నా చేతికి అందలేదు, చిక్కలేదు.
  • to come away యివతలికి వచ్చుట, వూడివచ్చుట.
  • matter came away from the wound పుంటిలో మంచి చీము బయిటికి వచ్చినది.
  • all her hair came away దాని తల వెంట్రుకలన్ని రాలిపోయినవి.
  • the juice came away రసము కారిపోయినది.
  • to come back మళ్లుకొనుట, తిరుక్కొనుట, మళ్ళివచ్చుట.
  • he came behind us in nothing యే విషయము లో నన్ను మాకు వాడు తక్కువ కాలేదు.
  • the board came between ఆ పలక అడ్డపడ్డది.
  • to come by ఓరగావచ్చుట.
  • How did he come by that money ? ఆ రూకలు వాడికి యెట్లా వచ్చినది.
  • How did he come by this sword? వాడికియీ కత్తి యెట్లా వచ్చినది.
  • to come down ఊడిపోవుట దిగుట.
  • when the house came down ఆ యిల్లు పడ్డప్పుడు.
  • he came down to my house నాయింటి దాకా వచ్చినాడు.
  • he came down with the price వాడు దానికి క్రయము చెల్లించినాడు.
  • to come forth బయిటికి వచ్చుట.
  • Forthcoming (as money) చేత వుండే, సిద్ధముగా వుండే హాజరుగా వుండె.
  • the money is forth coming లేని, లేకపోయిన, సిద్ధముగా వుండని.
  • the money is not forthcoming రూకలు హాజరులేదు.
  • when they came to trial the prisoner was not forthcoming విచారణ చేయవచ్చేటప్పటికి కైది హాజరు లేక పోయినాడు.
  • to come forward ముందుకు వచ్చుట, చక్కపడుట.
  • or thrive బాగుబడుట, రక్కొనుట.
  • to come in or agree సమ్మతించుట, ఒప్పుకొనుట.
  • when the ships came in contact వాడలు ఒకటితో వొకటి కొట్టుకొన్నప్పుడు.
  • His fathers death came in the way తండ్రి చావు వచ్చి అడ్డుపడ్డది.
  • he came in for a reward వాడికి వొక బహుమానము చిక్కినది.
  • he came in for punishment వాడికి శిక్ష తగిలింది.
  • when they came in front యెదట పడ్డప్పుడు.
  • to come into చొరబడుట కలుసుకొనుట, కూడుకొనుట.
  • they came into the plot వాండ్లు ఆ కుట్ర లో చేరినారు, కలిసినారు.
  • to come into power అధికారాన్ని పొందుట.
  • It came into his head యిది వాడికి స్పురించినది, తోచినది.
  • they came into my views నా బుద్ధి విన్నారు.
  • when they came into possession of the property ఆ యాస్తి వాండ్లకు చిక్కినప్పుడు, స్వాధీనమైనప్పుడు.
  • these poets do not come near him యీ కవులు వాడికి సరితూగలేక పోయిరి.
  • when it came near దగ్గిరించినప్పుడు.
  • I told you what would come of this యిందువల్ల యేమి కలుగునో దాన్ని నీతో చెప్పి వున్నాను.
  • To come off ఊడుట వదులుట, తప్పించుకొనుట,విడిపించుకొనుట.
  • he came off loser వోడినాడు.
  • he came off with a slight punishment స్వల్ప శిక్షతో తప్పించుకొన్నాడు.
  • To come on ఆరంభించుట, కనిపించుట, సంభవించుట, తగులుట, పట్టుట.
  • Fever came on జ్వరము తగ్గినది.
  • Rain came on వాన పట్టింది.
  • How does the work come on ? పని యెట్లా జరుగుతున్నది.
  • when the storm came on గాలివాన పట్టినప్పుడు.
  • To come out బయిటపడుట, ప్రచురమౌట, తెలిసిపోవుట, దేశము నుంచి బయలుదేరుట,వూడుట.
  • when the tooth came out పల్లు వూడివచ్చినప్పుడు.
  • the book came out ten years ago ఆ పుస్తకము ప్రచురమైన పది యేండ్లైనది.
  • when he came out with this story వాడు యీ కధను చెప్పినప్పుడు.
  • To come over పక్షమౌట, పక్షము లో చేరుట.
  • they came over to us మా పక్షములో చేరినారు.
  • To come right సరిపడుట, కుదురుట.
  • They came round me నన్ను చుట్టుకొన్నారు.
  • at last they came round తుదకు వొప్పుకొన్నారు.
  • To come short of or fail తప్పుట.
  • he came short of it వాడు అది తప్పినాడు.
  • To come TO దగ్గరికి వచ్చుట, వాడ నిలిచిపోవుట.
  • To come to or amount to ఔట, వెరసి తేలుట.
  • the account came to ten rupees ఆ లెక్క పది రూపాయల దాకా అవుతున్నది.
  • To come to the point ముఖ్యము యేమంటే.
  • how came you to know this? యిది నీ కెట్లా తెలిసినది.
  • what is come to you ? నీకేమి పట్టినది.
  • In time to come యిఖను, ఉత్తరోత్తర, మీదటికి, రాబొయ్యే కాలమందు.
  • To come about or happen తటస్థించుట, సంభవించుట.
  • at last they came to blows తుదకు పోట్లాడసాగిరి.
  • I came to the same conclusion నాకున్ను అట్లాగే తోచినది.
  • To come to an end ముగియుట, తీరుట, శాంతించుట.
  • when the business came to an end పని ముగియగానే.
  • they came to evil చెడిపోయినారు.
  • they came to extremities పోట్లాడినారు, కొట్లాడినారు.
  • To cometo good చక్కబడుట, ఫలించుట, నెరవేరుట, పనికివచ్చుట.
  • To come to hand అందుట, దొరుకుట, చేరుట, చేతికి వచ్చుట.
  • when the letter came to hand ఆ జాబు చేతికి అందినప్పుడు, చేరినప్పుడు.
  • To come to a head as a boil మొనగా తేలుట.
  • when the boil came to a head గెడ్డ తేలినప్పుడు.
  • as the small pox నేతులు పోసుట.
  • To come to himself స్మారకము వచ్చుట, తెలివివచ్చుట.
  • when he came to himself వాడికి స్మారకము వచ్చినప్పుడు, వొళ్లు తెలిసినప్పుడు.
  • he came to his senses or to himself వాడికి తెలివి వచ్చినది, వాడికి స్మారకము వచ్చి వచ్చినది.
  • If his father comes to the knowledge of this or If this comes to the knowledge ofhis father యిది వాడి తండ్రికి తెలిస్తే.
  • To come to life పుట్టుట, అవతరించుట.
  • Before they came to life వాండ్లు పుట్టక మునుపే.
  • To come to light బయటపడుట, ప్రసిద్ధమౌట.
  • when this came to light యిది బయట పడ్డప్పుడు.
  • It came to nothing అది వ్యర్ధమైనది, తప్పిపోయినది.
  • To come to an opinion తీర్పు చెప్పుట, శాసనము గా చెప్పుట, భావించుకొనుట.
  • they came to this opinion యిట్లా నిశ్చయించిరి.
  • the opinion you came to మీకు తోచిన అభిప్రాయము.
  • when they came to particulars వాండ్లు వయనము చెప్పినప్పుడు.
  • To come to pass or to come about తటస్థించుట, సంభవించుట.
  • It came to pass that his brother died సంభవించిన దేమంటే అన్న చచ్చినాడు.
  • To come to terms సమాధాన పడుట, రాజీపడుట.
  • at lastthey came to terms తుదకు సమాధానపడ్డారు.
  • It comes to the same thing యెటైనా వఖటే, రెండూ ఒకటే, రెండూ సరే.
  • when it came to view అది అగుపడ్డప్పుడు, కండ్లపడ్డప్పుడు.
  • To come undone ఊడిపోవుట.
  • the string came undone దారము వూడిపోయినది.
  • To come up or equal సమానమౌట.
  • they do not up to him in learning వాండ్లు చదువులో వాడికి సమానము కాలేరు.
  • when the grain comes up పయిరు మొలిచినప్పుడు.
  • that topic cameup ఆ సంగతి బయటపడ్డది.
  • To come up with వచ్చి చేరుట, అందుకొనుట.
  • when they came up with me నన్ను వచ్చి కలుసుకొన్నప్పుడు.
  • the spirit came upon him వాడికి ఆవేశేము వచ్చినది.
  • when old age comes upon him వాడికి ముదిమి వచ్చినప్పుడు.
  • the thieves cameupon them దొంగలు వాండ్ల మీద వచ్చి పడ్డారు.

The two verbs To Comeand To Go are often used for one another: severalinstancearepointedoutinthenotestomyvolumeo

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=come&oldid=926767" నుండి వెలికితీశారు