step
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, అడుగుపెట్టుట, తొక్కుట.
- to go పోవుట, నడుచుట.
- when he stepped ashore గట్టు న దిగేటప్పటికి.
- he stepped asideతొలిగినాడు.
- he stepped down into the pond గుంట లో దిగినాడు.
- they stepped forward వాండ్లు ముందరికి వెళ్లినారు, ముందరికినడిచినారు.
- they stepped forward to assist him వాడికి సహాయముచేయడానకై బైలు దేరినారు.
- step in లోనికిరా.
- they stepped into his estate వాడి ఆస్తి వీండ్లకు వచ్చినది.
- they stepped out of doorsయింట్లోనుంచి బైటికి వెళ్ళినారు.
- they stepped over the stair మెట్లెక్కి దిగిపోయినారు.
- when he stepped up to me నా వద్దికి వచ్చేటప్పటికి.
- they stepped up to him వాడి వద్దకి వచ్చినారు.
నామవాచకం, s, అడుగు.
- they tread in his steps వాడు పోయినదోవనేవాండ్లు పోతారు, అనగా వాడు యెట్లా చేసినాడో అట్లాగే వీండ్లున్ను చేస్తారు.
- progress in affairs అభివృద్ధి.
- this dictionary is one step in teaching English ఇంగ్లీషు నేర్చుకోవడమనకు యీ నిఘంటు వొక మెట్టుగా వున్నది.
- yesterday he could not eat at all, to-day he has eaten a little, this is one step in recovery నిన్న వాడుశుద్ధముగా తినలేక వుండినాడు నేడు కోంచెము తిన్నాడు స్వస్థము కావడమునకుయిది వొక మెట్టు.
- last month he could not read at all; he has now learned his letters, this is one step పోయిన నెలలో సుద్ధముగాచదవలేకుండా వుండినాడు యిప్పుడు అక్షరాలు నేర్చుకొన్నాడు, యిది వొక మెట్టు.
- last year he was a gambler, now he is a drunkard; this is another step towards ruin పోయిన సంవత్సరము జూదరిగా వుండినాడు యిప్పుడు తాగుబోతున్ను అయినాడు చెడిపోవడానకు యిది మరిన్ని వొక దోవ.
- a stair మెట్టు, పడిగట్టు.
- one step in a ladder నిచ్చెనమెట్టు.
- a well with steps down into it నడబావి, దిగుడు బావి.
- in genealogy పురుషాంతరము.
- step by step అడుగుమీద అడుగుగా, క్రమేణ.
- he bent his steps towards the town పట్టణమునకై వెళ్ళినాడు.
- a step fatherరెండో తండ్రి, అనగా తండ్రిచనిపోయిన తర్వాత తల్లిని పెండ్లాడినవాడు.
- a step mother చవితితల్లి.
- a step son చవితి కొడుకు, మొదట పెండ్లాడి చనిపోయిన వాడికి పుట్టిన కొడుకు, రెండోమాటు పెండ్లాడిన మొగుడి యొక్కమొదటి పెండ్లానికి పుట్టిన కొడుకు.
నామవాచకం, s, a Russian word for a plain: less correctly written steppe బైలు, మైదానము, ఇది ఇంగ్లీషు మాట కాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).