తాళములోని ఒక భాగమునకు, అనగా లఘువో, దృతమో దేనినైనను అంగమున వచ్చును.
తాళ దశ ప్రానములలో నొకటి.
సంగీత రచనలో ఏ భాగములకైననూ అంగమని పేరు. పల్లవి ఒక అంగము. ఇదే రీతిగా ఇతరములు
అంతర గాంథారము: గాంధారము సప్తస్వరములలో మూడవ స్వరము. అంతర గాంధారము గాంధార వికృతి భేదములలో రెండవది. దీనినే హిందూస్థానీ సంగీతములో తీవ్ర గాంధార మందురు.
అంశము : జీవస్వరమనియు రాగ చ్ఛాయస్వరమనియు కూడ వాడుట కలదు. అంగ స్వరమనగా ఒక రాగము యొక్క సంపూర్ణ రూపము ఏ స్వరము యొక్క తరచు వాడుక వల్ల వెల్లడింపబడుచున్నదో ఆ స్వరము అంశ స్వరమనబడుచున్నవి. అంతర గాంధారము శహాన రాగమునకు అంశము.
అంతర మార్గ : రాగమునకు చెందని స్వరమును వాడుట.
అక్షర కాలము : ఒక హ్రస్వాక్షరము పాడునంత కాల పరిమితి.
ఆరోహణము : కొన్ని స్వరములు ఆరోహింపు, లేక పైకి ఎక్కు పద్ధతి లో ఉండుట. రి గ మ ప ద స.
ఆరోహి : కొన్ని ఆరోహణ క్రమ సంచారములు.
ఆలాపన : రాగమును ప్రవృద్ధి చేయు కళకు ఆలాపన మని పేరు. దీనినే హిందుస్థానీ సంగీత పాఠకులు, "ఆలావ్" అందురు.
ఆక్షీప్తిక : రాగము ఆలాపించుటకు కొన్ని నిబంధనలున్నవి. వాటిలో ఆక్షప్తిక మొదటిది. అనగా పాడబోవు రాగము యొక్క స్వరూపమును సంక్షేపముగా వినువారలకు తెలియబరచు దానిని ఆక్షిప్తిక అని పేరు.
కైసికి నిషాదము : నిషాద విభేదములలో మొదటి నిషాదము; ఫ్రీక్వెన్సీ 9/5 . దీనినే ఆంగ్ల సంగీతములో B(flat) అందురు.
కాకలి నిషాదము : నిషాద విభేదములలో రెండవ నిషాదము. ఫ్రీక్వెన్సీ 15/8. దీనినే ఆంగ్ల సంగీతములో B(Sharp) అందురు.
కాకపాదము :షడంగములలో ఒక అంగము. దినిని ఒక ఘాతము, పథకము, కృష్య, సర్పిణీలతో క్రియ చేయవలయును. సంకేతములో + తో చూపబడును. ఒక్కొక్క క్రియ విలువ నాలుగక్షరకాలములు కనుక కాకపాదము యొక్క విలువ 16 అక్షర కాలములు.
కృష్య :చేతిని ఎడమ ప్రక్కకు విసరుటను కృష్య అనిపేరు. షడంగములలో కొన్ని అంగములలో ఉపయోగించు క్రియ.
కదంబ : త్రిశ్ర జాతి ఝంపె తాళము యొక్క పేరు. ౹3 υ ౦ = 3+1+2=6 అక్షర కాలములు.
కర : సంకీర్ణ జాతి ఝంపె తాళము యొక్క పేరు. ౹9 υ ౦ = 9+1+2=12 అక్షర కాలములు.
కుల : మిశ్రజాతి రూపకతాళము యొక్క పేరు. ౦ ౹7 = 2+7=9 అక్షర కాలములు.
కటకము : చిట్టతానము; రాగము ఎన్ని రకముల సంచారములతో రంజింపజేసి రాగ స్వరూపమును అఖండ తేజోవంతముగా చూపుటకు వీలగునో అన్ని సంచారములను ఇమిడ్చి తాన రూపముగా పూర్వులు వ్రాసిన రచన.
క్రమసంపూర్ణము : ఆరోహణము, అవరోహణము క్రమముగా నుండుట, అనగా వక్రించక నుండుట.
క్రమషాడవము : ఆరోహణమునందు ఏ స్వరము వర్జమో అవరోహణమునందున అదే స్వరము వర్జింపబడిన వర్జరాగము. ఉదా: శ్రీరంజని రాగము.
క్రమ ఔడవరాగము : ఆరోహణమునందు ఏఏ స్వరములు వర్జింపబడినవో ఆ స్వరములే అవరోహణమునందున వర్జింపబడిన వర్జరాగము. ఉదా: మోహన రాగము.
కాళహస్తీశ్వర పంచరత్నములు : వీణ కుప్పయ్య గారు శ్రీ కాళహస్తీశ్వరునిపై రచించిన ఐదు కృతుల సముదాయము.
సంఖ్య
పాట మొదలు
రాగము
తాళము
1
కొనియాడిన
కాంభోజి
ఆదితాళము
2
ననుబ్రోవరాదా
కాసు
ఆదితాళము
3
బిరాననుబ్రోవ
హంసధ్వని
ఆదితాళము
4
సామగానలోల
పాలగభైరవి
ఆదితాళము
5
సేవింతమురారమ్మ
శహన
ఆదితాళము
కృతి :సంగీత రచనలలో ఇంపునూ,ముఖ్యమైన రచన. లక్షణము రచన ప్రకరణములో కాననగును. దీనిలో రాగ భావమునకు ప్రాధాన్యము.
కీర్తన : భక్తి రచన. పల్లవి, అనుపల్లవి కొన్ని చరణములుండును. భక్తిని వ్యాపించుటకై, రచించిన రచన. సాహిత్య భావమునకే ప్రాధాన్యము. ఇతర వివరములు కృతి లక్షనములో కాననగును.
కర్ణాటక సంగీత పితామహ :పురందరదాసుల వారి బిరుదు. వీరిని ఆది గురువనియు బిరుదు కలదు.
కొనగోలు : జతులను నోటితో తాళబద్ధంగా ఉచ్చరించుట.
కొవ్వూరి పంచరత్నములు: కొవ్వూరి సుందరేశ్వర స్వామిపై త్యాగయ్య రచించిన ఐదు కృతులు.
గాంధర్వ వేదము : సంగీత వేదము; నాలుగు పపవేదములలో నొకటి; అవి ఆయుర్వేదము, ధనుర్వేదము, అర్థ శాస్త్రము , గాంధర్వ వేదము.
గాయకుడు : పాటకుడు; నోటిపాట పాడువాడు.
గమకము : ఊపు, ఒక స్వరమును ఎట్లు ఊచి పాడినను దానిని గమకము అందురు. గమకము మన కర్ణాటక సంగీతములో పెట్టిన వేరు. చిన్న ప్రయోగమునైనను గమకముతో పాడుట మన దేశపు పసిబిడ్డకు కూడా తెలిసిన అంశము.
గాంధర్వ తత్వము : సంగీత శాస్త్రము.
గతి : తాళ నడక.
గీతము : సంగీత రచనలలో నొకటి; పల్లవి, అనుపల్లవి, చరణములను భాగములుండని రచన.
గుప్తము : త్రిశ్రజాతి ఆట తాళము పేరు. 13 13 0 0 = 3+3+2+2 = 10 అక్షరముల విలువ.
గురువు : షడంగములలో నొక అంగము; క్రియా విధానము - ఒక ఘాతము మరియు ముడిచిన అరచేయి గుండ్రముగా త్రిప్పుట, సశబ్ద, నిశబ్ద లఘువులు. అక్షర కాలములు ఎనిమిది. అంగ సౌంజ్ఞ 8.
గాంధర్వ గీత : అనాది సాంప్రదాయములో వచ్చిన సంగీతము. గాన గీతము కంటే పురాతనము.
చవుక కాలము : చాల నెమ్మదిగా నడచునది. ఒక అక్షరమునకు ఒక స్వరము పాడునది.
చతుశృతి రిషభము : విషభమను సప్త స్వరములలో రెండవ స్వరము యొక్క రెండవ రూపము. ఫ్రీక్వెన్సీ : 9/8.
చతుశృతి దైవతము : దైవతమను సప్త స్వరములలో ఆరవ స్వరము యొక్క రెండవ రూపము. ఫ్రీక్వెన్సీ : 27/16.
చతురశ్ర లఘువు : నాలుగు అక్షరముల విలువ గల లఘువు; 14, క్రియా విధానము : ఒక ఘాతము, మూడు వ్రేళ్ళను ఎంచుట.
చతుర్థ కాలము : నాల్గవ కాలము, సంకేతములో స్వరముల గుంపుపై మూడు అడ్డగీతలను గీయవలయును.
చక్రము : త్రిశ్రజాతి రూపక తాళము యొక్క పేరు. 0 13 = 5 అక్షర కాలములు
చక్రము : 72 మేళకర్త రాగములను పండ్రెండు భాగములుగా భాగించి, ఒక్కొక్క భాగమునకు చక్రమని శ్రీ వేంకట మఖి పేరు పెట్టినారు.
చణ : ఖండజాతి జంపె తాళమునకు పేరు. 15 u 0 =8 అక్షరముల కాలము.
చరణము : కర్ణాటక సంగీత రచనలలో మూడవ భాగమునకు చరణమని పేరు. వర్ణము, కృతి, పదము మొదలగు రచనలు ఉదాహరనములు
చతుస్వర వక్రరాగము : ఆరోహణలో గాని, అవరోహణలో గాని లేక రెండింటిలో గాని నాల్గు స్వరములు వక్రముగా నుండిన యెడల ఆ రాగమునకు చతుస్వర వక్రరాగమని పేరు.
చిట్టతానము : వీణ వాద్యము నభ్యసించువారి కొరకు రచించిన రచన. కటకమనియు దీనికి పేరు.
చౌకవర్ణము : పదవర్ణము; పదవర్ణము యొక్క నడక చాల నెమ్మదిగాను,చౌకముగానూ ఉండటం వల్ల చౌకవర్ణమని పేరు వచ్చింది.
చిన్న మేళము : సదిరు; దక్షిణ హిందూ దేశ నృత్యములకు ఉపయోగించు మేళము.
చిట్టస్వరము : కృతుల చివర నుండు కొన్ని స్వరావర్తములు.
ఛాయాలగ రాగము : ఒక రాగములో నింకొక రాగచ్చాయ కనబడు రాగము;
చక్రవాకము : 16 వ జనక రాగము.
చారుకేశి : 26 వ మేళకర్త రాగము.
చలనాట : 36 వ కర్త రాగము.
చిత్రాంబరి : 66 వ మేళకర్త రాగము.
చాపుతాళము : సప్త తాళములు కాక వేరు తాళము. చాపు తాళములు రెండు రకములు; ఖండచాపు;మిశ్రచాపు; ఖండచాపు - 2+3= 5 అక్షరకాలములు. ఉదా: కండు కండు నీ యన్న రాగమాలిక - పురందరదాసు, మిశ్ర చాపు:3+4=7 అక్షరకాలములు. ఉదా: మనసు స్వాధీన - శంకరాభరణము - త్యాగయ్య.
చతుర్దండి ప్రకాశిక : సంగీత గ్రంథము, శ్రీ వెంకటముఖిచే వ్రాయబడినవి.
చిత్ర లేదా చిత్రతర లేదా చిత్రతమ : తాళదశ ప్రాణములో లయ అను ప్రానము యొక్క విధానములు; తాళదశ ప్రాణములు చూడాదగును.
చిన్నస్వామి మొదలియార్ : ఎ.ఎం.చిన్నస్వామి మొదలియార్ గారు. మన కర్ణాటక సంగీతమును ప్రపంచమున కంతకును వ్యాప్తి చేయవలయునను అధికాభిలాషతో చాల వ్యయప్రయాసలతో మన సంగీతమును సరళీవరుల నుండి పెద్ద కృతుల వరకు ఆంగ్ల సంకేతమైన స్టాఫ్ నొటేషనులో వ్రాసి మాస పత్రికగా 1892 నుండి ప్రచురించిరి. వీరు కర్ణాటక సంగీతమునకు చేసిన కృషి అత్యద్భుతము. సత్ప తాళాలంకారములు కూడ స్టాఫ్ నొటేషనులో వ్రాసి యున్నారు.
చాముండేశ్వరీ పంచ రత్నములు : చాముండేశ్వరీ పై వీణ కుప్పయ్య గారు రచించిన ఐదు కృతులు; భాష తెలుగు.
జాతి : లఘువు యొక్క రకము; త్రిశ్ర జాతి 13; చతురశ్ర జాతి 14 ; ఖండజాతి 15 ; మిశ్రజాతి 17 ; సంకీర్ణ 19; తాళదశ ప్రాణములలో నొకటి.
జంట వరుసలు : సప్త స్వరములైన తరువాత ఒక్కొక్క స్వరమును రెండుగా జంటగా నేర్పు చిన్న రచనలు. సస రిరి గగ మమ, మొదలగునవి.
జనక రాగము : మేళకర్త రాగము; లక్షణములు: క్రమసంపూర్ణముగానూ, ఆరోహణములందు ఒకే రక స్వరములను కలదిగాను ఉండవలయును. ఉదా: ధీరశంకరాభరణము; మేచకల్యాణి.
జన్య రాగము : జనకరాగము నుండి పుట్టిన రాగము.
జతి : తక, తరి , కిట ,ఝం, మొదలగు తాళపదములు.
జతిస్వరము : సంగీత రచన; ఆంధ్రదేశమున స్వరపల్లవి అనియు - అనుట కలదు. పల్లవి, అనుపల్లవి, చరణముల కలిగియుండును. సాహిత్యముండదు.
జీవ స్వరము : అంశస్వరము; రాగచ్చాయస్వరము; రాగ స్వరూపమును చూపెట్టు స్వరము.
జీవము : తంబూర యందు శృతి శుద్ధముగా చేసిన తరువాత నాదము చక్కగా నుండుట కొరకు ఉన్ని దారమును మెలిక తీసి బ్రిడ్జిపై ఒక్కొక్క తంతికిని "జిల్ల" ను శబ్దము వచ్చు వరకు జరుపుట ఆచారము. ఆ ఉన్ని దారమును జీవమని చెప్పుట కలదు.
డమరు : ఒక విధమైన చిన్న తాళవాద్యము. ఈశ్వరుడుపయోగించునది.
డమరుయతి : తాళదశ ప్రాణములలో నొకటి. ఆ యతి అంగములలో డమరుయతి ఒకటి. డమరు వలె అంగములు ఇరుప్రక్కల ఎక్కువ అక్షరములుగా గలిగి మధ్య కొద్ది అక్షరాంగములు కగ యతికి డమరు యతి అని పేరు. 8 1 O U O 1 8.
త్రిపుశ్చము : స స స, రి రి రి , గ గ గ వలె ఒక స్వరము మూడు జంట గా వచ్చునది. ఉదా: భైరవి ఆట తాళ వర్ణములో మూడవ ఎత్తు గడ స్వరములో పపప ధధధ నినిని స స రి ..............
దాటుస్వరము : రెండు స్వరముల మధ్య ఒకటో లేక కొన్ని స్వరములో వర్జించునది. అనగా రిప, మద, పని మొదలగునవి. ఉదాహరణ: శంకరాభరణ ఆట తాల వర్ణము "చలమేల" పల్లవిలో రి ని - స ద - ని ప - ద మ - ప గ - మ రి - క పా ....
ధృవరూపకము : ఒక రకమైన రూపక తాళము. ఈ తాళములో రచింపబడిన యొక్క ప్రతి అంగారంభములోనూ రెండు దృతములు రెండు లఘువులు అయిన పిదప రూపక తాళాంగములు వరుసగా నుండును. ఈ రచన రూపక తాల రచనయే.
నిరవల్ : మనోధర్మ సంగీతములో నొక రకము; కృతిలోని ఒక భాగమును గాని, లేక పల్లవి(మనోధర్మ) ని గాని పెంపొందించి సంగతుల వలె రాగ స్వరూపమును సాహిత్య భావమునూ పరిపూర్ణ స్వరూపంతో తాళబద్ధంగా పాడు దానికి నిర్రవల్ అని పేరు. "నిరవల్" ఆరవ పదము.
నిషాందాంత్యరాగము: మంద్రస్థాయి నిషాదము క్రిందను, మధ్యస్థాయి నిషాదము పైననూ సంచారము లేని రాగము. ఉదా: నాద నామక్రియ.
రాగమాలిక : సంగీత రచన; తాళము ఒకటిగానే యుండి, ఒక్కొక్క భాగము ఒక్కొక్క రాగములో రచింపబడిన రచన.
రాగమాలిక కీర్తన : కీర్తన యొక్క అంగములు వేర్వేరు రాగములతో నుండు రచన. అరుణాచల కవి రాయరు గాలి ఎనక్కు నిరుపదంనూ, జయజయ గోకుల బాల అను నారాయణతీర్థ కీర్తనలు ఉదాహరణములు.
రాగమాలికావర్ణనము : వర్ణము యొక్క అంగములు వేర్వేరు రాగములను కలిగి యుండుట.
రుద్ర : 11 వ చక్రము.
రాగతాళమాలిక : ఒక్కొక్క అంగము వేర్వేరు రాగమును, తాళమును కలిగిన రచన.
రచయిత : సంగీతమును రచించువాడు.
రాగవర్థిని : రాగ ఆలాపన లోని రెండవ భాగము.
రసికుడు : సంగీతామృతమును గ్రోలువాడు.
రగణమఠ్యతాళము : ఈ తాళము క్రింది అంగములను కలిగి యుండును. గురువు,లఘువు, గురువు 8 1 8; ఒక ఆవర్తనమునకు 20 అక్షర కాలములు.
వర్ణము : గానము చేయు పద్ధతి మరియు సంగీత రచన.పల్లవి, అనుపల్లవి, ముక్తాయిస్వరము, చరణము చరణస్వరములను కలిగి యుండును. రచన ప్రకరణము చూడదగును.
వసు : 8 వ చక్రము.
వేద : 4 వ చక్రము
వేంకటేశ పంచ రత్నములు : వీణ కుప్పయ్య గారు రచించిన 5 కృతులు.
సంఖ్య
పాట మొదలు
రాగము
తాళము
1
మమ్ము బ్రోచుపట్ల
సింహేంద్ర మధ్యమము
ఆది
2
నన్నుబ్రోవ
మఖార
ఆది
3
సరోజాక్ష
సావేరి
ఆది
4
నీవే దిక్కని
దర్బారు
ఆది
5
బాగుమీరగను
శంకరాభరణము
రూపకము.
విజయ రాఘవ పంచరత్నములు : తంజావూరు విజయరాఘవ నాయకుపై క్షేత్రయ్య రచించిన 5 పదములు.
విలోమక్రమ : వికటకవి క్రమము.
విన్యాస : త్రయోదశ లక్షణములలో నొకటి.
విరామ : అనుదృతము.
విశేషసంచారము : రాగములో రంజకము కొరకు చాల మితముగా వాడబడు సంచారము.
విశ్రాంతి : రచనలో కొంత వరకు విశ్రాంతి యుండుట.
వివాది స్వరము : రెండు స్వరముల మధ్య ఒక్క శృతి మాత్రము భేదముండిన యెడల ఆ రెండు స్వరములు ఒకదాని నొకటి వివాది అనబడును. వివాది స్వరము, శత్రు స్వరము, హిందూస్థానీ సంగీతములో వర్జస్వరమును వివాది స్వరమనుట వాడుక.
వుసి : విసర్జితము.
వక్ర : వంకర టింకర.
వక్ర రాగము : ఆరోహణమో, అవరోహణమో లేక రెండు వక్రముగా (వంకర టింకర) నుండు రాగము.
వక్రాంత్యస్వరము : వక్రము ఏ స్వరముతో ఒక రాగములో ముగియునో ఆ స్వరము వక్రాంత్య స్వరమనబడును.
వక్ర సంపూర్ణరాగము : సంపూర్ణ రాగము వక్రముగా నుండుట. ఉదా: శహాన.
వక్ర సంచారము : సంచారము వక్రముగా నుండుట.
వక్ర స్వరము : ఏ స్వరము యొద్ద వక్రము యేర్పడునో ఆ స్వరమునకు వక్ర స్వరమని వేరు. ఉదా: స రి గ మ ప మ ప ద ని సా. "మ" వక్ర స్వరము.
వక్రత్వము : వక్రగుణము.
వర్జరాగము : ఆరోహణములోగాని, అవరోహణములోగానీ, లేక రెంటిలో గాని, ఒకటి, రెండు, మూడు, స్వరములు వర్జింపబడిన రాగము వర్జ రాగము.
వర్జస్వరము : వర్జింపబడిన స్వరము, ఉదా: మధ్యమావతీలో గాంధారమును, దైవతమును వర్జ స్వరములు.
స్వకీయ స్వరము : భాషాంగ రాగములో అన్య స్వరమును దాని యొక్క విభేద స్వరమును ఉండును. అపుడు ఆ రాగము యొక్క మేళకర్త స్వరమును "స్వకీయ స్వరమని" యు, భేద స్వరమునకు "అన్యస్వరమని"యు పేరు. ఉదా: కాంభోజి లో కైసికి నిషాదమును, కాకలి నిషాదమును కలవు.కైసికి నిషాదము, తన మేళకర్తయగు హరి కాంభోజి స్వరమే, కనుక ఇది "స్వకీయ స్వరము". కాకలి నిషాదము కాంభోజికి క్రొత్త అలంకారము నిచ్చు స్వరము. కనుక ఇది ఆన్య స్వరము.
స్వరజతి : పల్లవి, అనుపల్లవి, చరణము, లేక చరణములు కలిగిన రచన.చరణములు వేర్వేరు ధాతువులతో నుండును. వర్ణముల కు ముందు నేర్పబడునది.
సంచారి గీతము : సామాన్య గీతము లేక లక్ష్యగీతమని వేరే పేర్చు. దీని సాహిత్యము భగవస్తుతి గలదై యుండును.
సంకీర్ణ : సంకీర్ణ రాగము , తొమ్మిది.
సార : త్రిశ్ర జాతి మఠ్యతాళమునకు పేరు. అంగ సంజ్ఞ 13 0 13 = 8 అక్షరములు.
సూళాది : సప్త తాళమునకు సూళాది తాళములని పేరు.
సూర : మిశ్ర జాతి ఝంపె తాళమునకు పేరు. అంగ సంజ్ఞ 17 U 0 = 10 అక్షరములు.