అలంకారము
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- అలంకారము నామవాచకము.
- వ్యుత్పత్తి
మూలపదము.
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- అందాన్ని ఇనుమడింపజేసేవి అలంకారాలు.
- సంగీతంలో సౌందర్యమును, అందమునిచ్చు స్వరముల గుంపు. సప్త తాళముల యొక్క స్వర శిక్షనాలంకారములు, సప్త తాళములే కాక వాటి 35 తాళముల అలంకారములు.
- అలంకారములు: తెలుగు భాషాసంబందమైనవి:అలంకారములు- 1. శబ్దాలంకారములు, 2. అర్థాలంకారములు, 3. ఉభయాలంకారములు (అని కొందఱు) : శబ్దాలంకారములు : అర్థము విచారింపక శబ్దము వినఁగనే చెవులకింపుగా వినఁబడునది. ఇందులో ననేక భేదములుఁ గలవు. (౧) ఛేకానుప్రాసము, (౨) వృత్త్యనుస్రాసము, (౩) లాటానుప్రాసము, (౪) యమకము (ఇందు పదయమకము, పాదయమకము, ముక్తపదగ్రస్తము, సింహావలోకనము) (౫) అంత్యనియమము, (౬) పునరుక్తవచాభాసము. మఱియు అనుప్రాసము మొ||;
- అర్థము ప్రధానముగా గలిగి కావ్యశోభాహేతువులైనవి అర్థాలంకారములు. అందులోకొన్ని:[అలంకారములు ]: ౧. అతద్గుణము, ౨. అతిశయోక్తి, ౩. అత్యుక్తి, ౪. అధికము, ౫. అనన్వయము, ౬. అనుగణము, ౭. అనుజ్ఞ, ౮. అనుమానము, ౯. అన్యోన్యము, ౧౦. అపహ్నవము, ౧౧. అర్థాంతరన్యాసము, ౧౨. అల్పము, ౧౩. అవజ్ఞ, ౧౫. అసంగతి, ౧౬. అసంభవము ౧౭. ఆక్షేపము, ౧౮. ఆవృత్తిదీపకము, ౧౯. ఉత్తరము, ౨౦. ఉత్ప్రేక్ష, ౨౧. ఉదాత్తము, ౨౨. ఉన్మీలితము, ౨౩. ఉపమానము, ౨౪. ఉపమేయోపము, ౨౫. ఉల్లాసము, ౨౬. ఉల్లేఖ, ౨౭. ఏకావళి, ౨౮. కారకదీపకము, ౨౯. కారణమాల, ౩౦. కావ్యలింగము, ౩౧. కావ్యార్థాపత్తి, ౩౨. గూఢోక్తి, ౩౩. చిత్రము, ౩౪. ఛేకోక్తి, ౩౫. తద్గుణము, ౩౬. తుల్యయోగిత, ౩౭. దీపకము, ౩౮. దృష్టాంతము, ౩౯. నిదర్శనము, ౪౦. నిరుక్తి, ౪౧. పరికరము, ౪౨. పరిపరాంకురము, ౪౩. పరిణామము, ౪౪. పరివృత్తి, ౪౫. పరిసంఖ్య, ౪౬. పర్యాయము, ౪౭. పర్యాయోక్తము, ౪౮. పిహితము, ౪౯. పూర్వరూపము, ౫౦. ప్రతివస్తూపమము, ౫౧. ప్రతిషేధము, ౫౨. ప్రతీపము, ౫౩. ప్రత్యనీకము, ౫౪. ప్రస్తుతాంకురము, ౫౫. ప్రహర్షణము, ౫౬. ప్రౌఢోక్తి, ౫౭. భావికము, ౫౮. భ్రాంతి, ౫౯. మాలాదీపకము, ౬౦. మిథ్యాధ్యవసితి, ౬౧. మీలితము, ౬౨. ముద్ర, ౬౩. యథాసంఖ్యము, ౬౪. యుక్తి, ౬౫. రత్నావళి, ౬౬. రూపకము, ౬౭. లలితము, ౬౮. లేశము, ౬౯. లోకోక్తి, /శృంగారము/అందము
- రసపోషణసహకారియయి కార్యమునకు శోభను కలిగించు రచనావిశేషము. (శబ్దనిష్ఠము శబ్దాలంకారము. -యమకాది. అర్థనిష్ఠము అర్థాలంకారము. -ఉపమాది అలంకారములు.)
అలంకరించు/సౌందర్యము/ భూషణము/దృష్టాంతము/ నిదర్శనము భూషణము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
అలంకరించుట, కావ్యాలంకారము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
నవ్వు ముఖమునకు అలంకారము
- గుఱ్ఱపు జీనునకు చేయు అలంకారములు
- ఒక యర్థాలంకారము
- అలంకారాదులతో రసభంగము గలిగింపరాదు.
- వాడు వట్టి అలంకార విద్యార్థి
- రసపోషణసహకారియయి కార్యమునకు శోభను కలిగించు రచనావిశేషము. (శబ్దనిష్ఠము శబ్దాలంకారము. -యమకాది. అర్థనిష్ఠము అర్థాలంకారము. -ఉపమాది.)
అనువాదాలు[<small>మార్చు</small>]
|