విక్షనరీ:రచ్చబండ/పాత చర్చ 1
నేమ్‌స్పేసులు
[<small>మార్చు</small>]వికీపీడియాలోలా కాకుండా విక్షనరీలో నేమ్‌స్పేసులను తెలుగులోనే పెడదామా? __చదువరి 16:50, 30 మార్చి 2006 (UTC)
- అలాగే! --వీవెన్ 02:04, 31 మార్చి 2006 (UTC)
నేమ్‌స్పేసులను అనువదిస్తే మనము మీడియా వికికి సమర్పించొచ్చు
- చర్చ: చర్చ
- వాడుకరి: సభ్య
- వాడుకరి చర్చ: సభ్య_చర్చ
- విక్షనరీ: విక్షనరీ
- విక్షనరీ చర్చ: విక్షనరీ_చర్చ
- దస్త్రం: బొమ్మ
- దస్త్రంపై చర్చ: బొమ్మ_చర్చ
- మీడియావికీ: మీడియావికీ
- మీడియావికీ చర్చ: మీడియావికీ_చర్చ
- మూస: మూస
- మూస చర్చ: మూస_చర్చ
- సహాయం: సహాయము
- సహాయం చర్చ: సహాయము_చర్చ
- వర్గం: వర్గము
- వర్గం చర్చ: వర్గము_చర్చ
అనువాదాల గురించి కూలంకషంగా ఇప్పుడే చర్చించడము మంచిది ఎందుకంటే ఇవి మళ్లీ మళ్లీ మార్చడము అంత సులువు కాదు --వైఙాసత్య 08:05, 10 April 2006 (UTC)
- అవున్నిజం. పై అనువాదాలు బాగానే ఉన్నాయి. మీడియావికి ని మీడియావికీ గా మార్చాను. (కి కి దీర్ఘం ఇచ్చాను.) __చదువరి 08:48, 10 April 2006 (UTC)
పదాలూ పేజీలూ
[<small>మార్చు</small>]ఎటువంటి పదాలకు పేజీలు సృష్టించాలి, వేటికి కూడదు అనే విషయమై విక్షనరీకి ఓ విధానం కావాలి. ఈ విషయమై చర్చ ఇది. దీనిపై ఒక విధానాన్ని నిర్ణయిద్దాం.
1. తెలుగు మాటలు అజంతాలు. హల్లు తోటి పదం అంతం కాదు. సున్నాతోటి కూడా అంతం కాదు. కానీ ప్రస్తుతం పదరూపాలు మారుతున్నాయి. పలికేటపుడు సున్నాంతంగా పలుకుతాము. రాయడం కూడా అలాగే రాస్తున్నారు. ఉదాహరణకు.. ప్రభుత్వము. దీన్ని ప్రభుత్వం అంటాం. అలాగే దీని బహువచనం ప్రభుత్వములు కాగా ప్రభుత్వాలు అని అంటాం. ఇలా ఎన్నో పదాలున్నాయి. భాష పరిణామక్రమంలో ఉకారాంతం కాస్తా హలంతమైపోతోంది. సున్నాతో అంతమయ్యే రూపమే ఎక్కువగా వాడుకలో ఉంటుంది కాబట్టి, దానికే పేజీని సృష్టించాలి. దీనికి మినహాయింపులుంటే ఇక్కడ చర్చించాలి.
2. అలాగే ఇతరభాషల నుండి చేరిన హలంత పదాలను మనం అజంతాలుగా మారుస్తాము. మచ్చుకు..
- బస్ - బస్సు
- రోడ్ - రోడ్డు
- నెట్‌వర్క్ - నెట్‌వర్కు
- ఇటువంటి పదాలకు అజంత రూపానికే పేజీని సృష్టించాలి.
3. పదం యొక్క ఏకవచన రూపానికే పేజీని సృష్టించాలి. బహువచనానికి ప్రత్యేకించి పేజీ సృష్టించరాదు. అయితే కొన్ని పదాలకు బహువచనాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఉదాహరణకు కన్ను.. దీని బహువచనం కళ్ళు. అలాగే పన్నుకు బహువచనం పళ్ళు. ఇవి సాధారణ బహువచన పదాల్లాగా ఏర్పడవు. ఇటువంటి పదాలకు పేజీలు సృష్టించవచ్చు
4. క్రియా పదం యొక్క అన్ని కాలాల రూపాలకూ పేజీలు సృష్టించవచ్చు. ఉదాహరణకు వెళ్ళు కు పేజీ ఉంటుంది. వెళ్ళెను, వెళ్ళును కు కూడా పేజీలు ఉంటాయి. ఆ పేజీల్లో సదరు పదాలు వెళ్ళుకు ఇతర రూపాలుగా పేర్కొంటూ వెళ్ళు పేజీకి లింకు ఇవ్వాలి. __చదువరి 12:48, 1 April 2006 (UTC)
విక్షనరీకో బాటు
[<small>మార్చు</small>]వికీపీడియాలో ప్రదీపు బాటుతో బాటింగు, బ్యాటింగు మొదలు పెట్టారు కదా! అలాగే ఇక్కడ కూడా కొత్తపేజీలు తయారుచెయ్యడానికి బాటొకటుంటే బాగుంటుంది. ఇంగ్లీషు విక్షనరీలో తెలుగు అర్థాలు చేర్చి ఉన్న ప్రతీ పదానికీ ఇక్కడో పేజీ తయారుచెయ్యగలిగితే పేజీతో పాటు ఇంగ్లీషు అర్థం కూడా సిద్ధమైపోతుంది. కాకపోతే ముందు పేజీమూస విషయం తేల్చెయ్యాలి. __చదువరి 19:05, 10 April 2006 (UTC)
చదువరీ, నేను ఇప్పుడిప్పుడే పైధాన్ వికీపీడియాబాట్ ఫ్రేంవర్క్‌ని ఆకళంపు చేసుకుంటున్నాను. ప్రస్తుతము ఆంగ్ల విక్షనరీలో SriBot ను తెలుగు విక్షనరీలో SrinivasaBot ను తయారు చేసాను. అక్కడ అభ్యసిస్తున్నాను. మన విక్షనరీకి తప్పకుండా సహాయపడగలను. --Srinivasa 22:00, 20 April 2006 (UTC)
బాటు చెయ్యాల్సిన పనులేంటి?
[<small>మార్చు</small>]- ఇంగ్లీషు విక్షనరీలో తెలుగు అర్థాలు రాసి ఉన్న పేజీలను పట్టుకోవాలి.
- అక్కడ వికీ లింకు ఇచ్చి ఉన్న ప్రతీ తెలుగు పదానికీ ఇక్కడ ఒక పేజీ తయారుచెయ్యాలి.
- ఈ పేజీలో ఇంగ్లీషు విక్షనరీలోని సంబంధిత పేజీకి ట్రాన్స్‌వికీ లింకు ఇవ్వాలి. చేసేందుకు వీలయితే అన్ని భాషల లోని పేజీలకు కూడా ట్రాన్స్‌వికీ లింకులివ్వాలి.
- అలాగే ఏ ఇంగ్లీషు పేజీనుండి సదరు తెలుగు పదాన్ని సేకరించామో ఆ ఇంగ్లీషు పదానికి కూడా తెలుగు విక్షనరీలో పేజీ తయారు చేసి, దాన్ని తెలుగు పదానికి దారిమార్పు పేజీగా చెయ్యాలి.
ఒక ఉదాహరణ:
- dog అనే ఇంగ్లీషు మాటను తీసుకుందాం.
- ఇంగ్లీషు విక్షనరీలో ఈ పేజీలో తెలుగు అనువాదంగా కుక్క, శునకము అని రాసి ఉంది.
- మన బాటు ఈ రెండు తెలుగు పదాలకూ చెరోపేజీని తెలుగు విక్షనరీలో తయారు చెయ్యాలి. ప్రతీ పేజీలోను ముందే అనుమతి పొందిన మూసను పెట్టాలి. "అనువాద పదాలు" విభాగంలో ఇంగ్లీషు: కు ఎదురుగా dog అని రాయాలి.
- ఇంగ్లీషుతో పాటు ఇతర భాషల ట్రాన్స్‌వికీ లింకులివ్వాలి.
- అలాగే dog అనే పేరుతో మరో పేజీ తయారుచేసి, ఆ పేజీలో #redirect [[కుక్క]] అని రాయాలి. ఇక్కడ రెండు పదాలు - కుక్క, శునకం - ఉన్నాయి కదా.., ఏ పేజీకి దారిమార్పు చెయ్యాలి అనే సందేహం సహజం! ఇలా ఒకటి కంటే ఎక్కువ తెలుగు పదాలున్నపుడు దారిమార్పు పేజీని మొదటిదాని పేజీకి గురిపెట్టాలి. __చదువరి 03:17, 17 April 2006 (UTC)
- నేను గమనించిన కొన్ని విషయాలను ఇక్కడ చేర్చాను బాటు తయారీలో అవి ఉపయోగపడవచ్చు. దాని ప్రకారం
ఎతరఇతర భాషాపదాలకు దారిమార్పు పేజీలకు బదులుగా ఆ పదం గురించి తెలుగులో వివరణ ఉండాలి. ఇలా ఇతర భాషా పదాల పేజీలో తెలుగులో వివరణ ఉండటం వలన వాటిని అర్ధం సులువుగా అర్ధం చేసుకోగలుగుతాము కూడా. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 05:59, 24 April 2006 (UTC)
మూస గురించి..
[<small>మార్చు</small>]మూస గురించి అనుకుని చాలా రోజులయింది. కొందరు సభ్యులు ఇప్పటికే పదాలకు పేజీలు తయారుచెయ్యడం మొదలుపెట్టారు. చావా కిరణ్ ఇప్పటికే ఒక ఒరవడి సృష్టించారు కూడా! ఇక ఆలస్యం జరక్కుండా Wiktionary:ప్రతిపాదిత మూస సంగతి తేల్చి, పని మొదలు పెట్టాలి. చావా కిరణ్ తయారు చేసిన మూసను కూడా పరిశీలించి, రెంటిలోని మంచి అంశాలతో మెరుగైన మూసను తయారుచేసి రంగంలో దిగాలనీ, జూలై 8 కల్లా మూసను సిద్ధం చెయ్యాలనీ నా ప్రతిపాదన. సభ్యులు మూసలో తగు మార్పులు చెయ్యాలని వినతి! __చదువరి 11:52, 4 July 2006 (UTC)
- అవును తొందరగా ఈ విషయము తేల్చాలి. Wiktionary:ప్రతిపాదిత మూస పేజీ వెనుక చాలా మంది సభ్యులు ఆలోచనలు పెట్టారు కనుక ఆలోచనాపరంగా ఈ పేజీ చాలా మెరుగైనది. కిరణ్ మూసలో కూడా కొన్ని మంచి ఆంశాలు ఉన్నాయి. మనము ఒక ఉదాహరణ పేజీ తయారు చేస్తే పేజీలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. రంగులు, హంగులు సరిచేయవచ్చు. అమ్మ పేజీ ఉదాహరణ పేజీగా తీసుకుందామా? --వైఙాసత్య 16:53, 6 July 2006 (UTC)
- అమ్మ పేజీకి కొన్ని మార్పులు చేసాను. __చదువరి 05:11, 8 July 2006 (UTC)
మూసలో TOC అవసరమా?
[<small>మార్చు</small>]అమ్మ పేజీని అనుసరిస్తూ మూస తయారు చేస్తే అందులో TOC అవసరమా అని నా సందేహము. ప్రస్తుత విధానములో ప్రతి పేజీలో అవే నాలుగు విభాగాలు ఉంటాయి. నాలుగు విభాగాలకు TOC అవసరము లేదేమో? --వైఙాసత్య 07:44, 8 July 2006 (UTC)
విక్ష్నరీమూస
[<small>మార్చు</small>]విక్ష్నరీమూస గురించి మీరుచేసిన సూచనకు ధన్యవాదాలు చదువరి గారూ. సుజాత
విక్షనరీ పేరు
[<small>మార్చు</small>]ఈ మధ్యన విక్షనరీని విఘంటువు అని పిలిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. విఘంటువు అనే పదం మీకు ఎలా అనిపిస్తుంది. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 02:58, 29 ఆగష్టు 2007 (UTC)
- వినటానికి నాకు బాగానే ఉంది అనిపిస్తుంది. దానికి విపరీతార్ధాలు ఏమి లేవని ఒకసారి తాబాసు గారిని అడిగి రూఢీ చేసుకుంటే సరిపోతుంది --వైఙాసత్య 03:55, 29 ఆగష్టు 2007 (UTC)
విఘంటువు కంటే వికీ నిఘంటువు అంటేనే బాగుంటుందేమో? వికీ మూలములు మరియు వికీ పాఠ్యపుస్తకములు లాగా! --అన్వేషి 08:14, 29 ఆగష్టు 2007 (UTC)
విక్షనరీ, వికీసోర్స్, వికీబుక్స్ .... ఇవన్నీ URL Names. వీటిని తెలుగులోనూ అలాగే ఉంచడం మంచిదని నా అభిప్రాయము. తెలుగు అనువాదిత పేర్ల విషయంలో వికీసోర్స్ - మూలములు మరియు వికీబుక్స్ - పాఠ్యపుస్తకములు లాగా విక్షనరీ - శబ్దకోశము అని ఉంది. కాకపోతే శబ్దకోశము అనేదాన్ని పదకోశము అని లేదా నిఘంటువు అనిగాని మార్చితే బాగుంటుంది.
మొదటిపేజీలలోనూ ఇతరచోట్ల వాడవలసివచ్చినప్పుడు మనము విక్షనరీ, వికీసోర్స్, వికీబుక్స్ నే వాడుతున్నాము. అలాకాకుండా వీకీ మూలములు, వీకీ పాఠ్యపుస్తకములు అలాగే వికీ నిఘంటువు (వికీ పదకోశము) అని ఉపయోగిస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయము. ---అన్వేషి 05:18, 31 ఆగష్టు 2007 (UTC)
- ప్రారంభములో వికీసోర్స్ ప్రాజెక్టును వికీమూలములు అని అనువందించవచ్చు, కూడదు అన్న అనుమానంతో కొన్ని సార్లు అది, ఇదీ ఉపయోగించడం జరిగింది. URL లు అన్ని భాషల ప్రాజెక్టులకు ఒకటే..కానీ ప్రాజెక్టు పేర్లను మాత్రం ఆయా భాషలకు అనుగుణంగా స్థానీకరించుకున్నాయి. వికీసోర్స్ ను వికీమూలాలు/వికీమూలములు/మరేదైనా అనాలా వద్దా అన్నది సముదాయ నిర్ణయం. ఎటు నిర్ణయించినా ఒకటే కానీ ఒకసారి నిర్ణయమైన తర్వాత అన్నీ చోట్లా అదే పేరును ఉపయోగించాలి. ఇక విక్షనరీ కింద పదకోశము అన్నది సులువుగానే మార్చేయవచ్చు --వైఙాసత్య 07:16, 31 ఆగష్టు 2007 (UTC)
- విక్స్నరీ బాగానే ఉన్నది కదా? ఇప్పుడు మార్చడము ఎందుకు? కావాలంటే విఘంటువు అని కూడా వ్యవహరిస్తే రెండూ ఉంటాయి. Chavakiran 07:38, 31 ఆగష్టు 2007 (UTC)
- విక్షనరీ - పదకోశము (వికీ పదకోశము) లేదా విక్షనరీ - నిఘంటువు (వికీ నిఘంటువు) ఏదైనా OK. --అన్వేషి 11:07, 31 ఆగష్టు 2007 (UTC)
- ఇది చూడండి . నా వోటు వికి నిఘంటువు--మాటలబాబు 20:36, 11 సెప్టెంబర్ 2007 (UTC)
బ్రౌను నిఘంటువులోని పదాలు
[<small>మార్చు</small>]విక్షనరీ (విఘంటువు, వికీనిఘంటువు, వికీపదకోశం)లో, బ్రౌను పదకోశంలో ఉన్న పదాలను చేర్చటం పూర్తయ్యింది :) ఈ ప్రయత్నంలో ఇక్కడ చేయాల్సిన పనులు ఇంకొన్ని మిగిలిపోయాయి:
- కొన్ని పదాలకు అర్ధాలు తెలుగు యూనీకోడులో కాకుండా WX ఫార్మాటులో ఉండిపోయాయి. వాటిని యూనీకోడీకరించాలి. ఇవి ముఖ్యంగా chop-fallen నుండీ cleverly వరకూ ఉన్న పేజీలు.
- కొన్ని పదాలకు బ్రౌను పదకోశంలోనే రెండుమూడు వేర్వేరు అర్ధాలు అర్ధాలు ఇచ్చారు. అలాంటి పదాలున్న పేజీలను ఒకసారి తనిఖీచేసి, వాటిని కలిపేస్తే ఆ పని పూర్తవుతుంది. ఈ పని చేయటానికి ఇంకో బాటు తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాను.
- సృష్టించిన ఆంగ్ల పదాల పేజీలలో, ఆ పదాల ఉఛారణ విధానాన్ని తెలుగులో తెలుపాలి.
- అలాగే బాటు చేర్చిన పేజీలలో ఉన్న అంతర్వికీ లింకులు పనిచేస్తున్నాయా లేదా అని ఒక పర్యాయం పరిశీలించాలి. ఈ పనికి కూడా ఒక బాటును రాసి అటువంటి పేజీలను గుర్తించవచ్చు. అలా గుర్తించిన తరువాత మనం ఆ లింకును తొలగించటమో లేదా పేజీనే సరయిన పేరుకు దారి మార్పో చేయాలి.
- ఈ పదకోశాన్ని యూనీకోడీకరిస్తున్నప్పుడు అచ్చుతప్పులు దొర్లే అవకాశం కూడా ఉంది. కాబట్టి అలాంటి అచ్చుతప్పులను కూడా పరిశీలించి సరి చేయాల్సిన అవసరం ఉంది.
- ఇలాంటి పేర్లతో సృష్టించిన పేజీలను తొలగించటం చేయాలి.
- a truss లాంటి పేర్లతో ఉన్న పేజీలను truss లాంటి పేజీలకు దేరిమార్పు చేసి ఆ తరువాత ఆ పేజీలో కొత్తపేరుకు తగ్గట్లుగా మార్పులు చేయటం.
స్థూలం ఇవీ ఇక్కడ మిగిలిపోయిన పనులు... నేను దృష్టిసారించని ఇంకొన్ని సమస్యలు కూడా ఉండవచ్చు, వాటిని కూడా మీరు గుర్తించినప్పుడు ఇక్కడ చేర్చండి. :) __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 04:09, 13 సెప్టెంబర్ 2007 (UTC)
ఉపయోగకరమైన లింకులు
[<small>మార్చు</small>]ఒకసారి ఈ లింకు చూడండి. ఉపయోగపడుతుందేమో! --అన్వేషి 06:03, 14 సెప్టెంబర్ 2007 (UTC)
ఇక్కడ "సంస్కృతన్యాయములు" ఉన్నవి. వీటిని మనము విక్షనరీలో చేర్చవచ్చా? --అన్వేషి 06:55, 14 సెప్టెంబర్ 2007 (UTC)
Wikimania Scholarships
[<small>మార్చు</small>]The call for applications for Wikimania Scholarships to attend Wikimania 2010 in Gdansk, Poland (July 9-11) is now open. The Wikimedia Foundation offers Scholarships to pay for selected individuals' round trip travel, accommodations, and registration at the conference. To apply, visit the Wikimania 2010 scholarships information page, click the secure link available there, and fill out the form to apply. For additional information, please visit the Scholarships information and FAQ pages:
Yours very truly,
Cary Bass
Volunteer Coordinator
Wikimedia Foundation
మూసలపై చర్చ
[<small>మార్చు</small>]తెలుగు విక్షనరీ మూసలుమెరుగపర్చవలసివుంది. ఇతర భాషల (కన్నడ, తమిళం) వాళ్లు చాలా సులభమైన మూసలతో, తక్కువ పరభాషా లింకులతో పదాల సంఖ్యను పెంచుకున్నారు. మనం బాట్ ల ద్వారా చేయగలిగిన పనిని స్పష్టంగా గుర్తించి, మనుషులు మాత్రమే చేయగలిగేదానిని మాత్రమే ప్రవేశ మూసలలో పెట్టాలి--Arjunaraoc 08:13, 22 సెప్టెంబరు 2010 (UTC)
వివిధ భాషల విక్షనరీల మధ్య సమన్వయం
[<small>మార్చు</small>]ఇంగ్లీషు విక్షనరీ, తెలుగు విక్షనరీల మధ్య సమన్వయం చేయవలసినది చాలావుంది. ఉదా: ఆంగ్ల- తెలుగు మన తెలుగు విక్షనరీ లో చేర్చాము. ఇంగ్లీషు విక్షనరీలో చూస్తే, మిగతా భాషల వారు, అక్కడ చేరుస్తున్నారు. ఆసక్తిగలవారు, ఈ రెండింటి ప్రస్తుత స్థితిని, ఇంగ్లీషు భవిష్యత్ ప్రణాళికను గమనించి, ప్రతిపాదనమొదలుపెడితే బాగుంటుంది.-- Arjunaraoc 02:44, 24 సెప్టెంబరు 2010 (UTC)
- ఇంగ్లీషు నుండి తెలుగులోకి వెళ్ళేటప్పుడు కొత్త మాటలని (ఇక్కడ లేనివి) సృష్టించటం ఎలా? Vemurione 01:39, 17 మే 2008 (UTC)
tevikilo laagaa victionaryloni diddubaatu pejeelo "escape" button nokkinaa kooda telugu aksharaalu type kaavadamu ledu. dayacesi parishkaram soocinchandi. --Nagaraju raveender 17:14, 30 మార్చి 2009 (UTC)
శశికాంత్ యేమకుంటున్నారు ?
[<small>మార్చు</small>]- శశికాంత్ గారు,
- షోడశ కన్యలు లేవని నేనే తెలియజేశాను.
- వీకీ పీడియాలో మీరు వ్రాశినది ఇప్పుడే చూశాను. మీ పద ప్రయోగాలు చూసి చాలా మనసు బాధ వేసింది. అటువంటి పదాలు వాడే ముందు ఒకటికి రెండు సార్లు ఇక ముందు అలోచించండి.
- నేను చేరిన కొత్తలో తెలియక వంశవృక్షాలు గురించి వీకీ పీడియాలో వ్రాసాను. అటువంటివి వ్రాయకూడదని చెప్పారు, ఆ తరువాత తీసివేయటము జరిగింది. యెప్పుడో జరిగిన దానికి గురించి ఇప్పుడిక్కడ ప్రస్తావించటము దేనికీ ? వెంటనే తగిన విధముగా క్షమాపణలు చెప్పండి. హిందువుల వంశవృక్షాలు అంటే మీకు అంత తేలికగా వుందా ? అదియును గాక వ్యక్తి గతముగా నన్ను విమర్శించటములో అర్ధము యేమిటి ?
- మీ గురించి మీరు యేమని అనుకుంటున్నారు ? కనీసము నా వయసును అయినా దృష్టిలో యెందుకు పెట్టుకోలేదు ?
- ఇప్పటి వరకు అన్ని వికిలలో యే రకములుగా మీరేం ఉద్ధరించారో తెలియ జేస్తే ఆ తరువాత అందరూ చర్చలు చేయవచ్చును.
- తెలుగు విక్షనరీలో మీరు చేసే ఘనకార్యాలేమిటో తెలియంది కాదు. ముందు మీ గురించి ప్రశ్నలు వేసుకొండి.
- ఈ నా జాబు చదివిన వారు వెంటనే తెలుగు వీకీపీడియా తప్పకుండా వీక్షించండి.
- నాతొ చర్చ చేయాలనుకుంటే యెప్పుడైనా, యెక్కడైనా, యెలాగైనా, యెంతసేపైనా, యెన్నిరోజులయినా చేస్తాను. (ఇక్కడ అనవసరము అనుకుంటాను.)
- శశికాంత్ వెంటనే క్షమాపణలు చెప్పండి. లేనియెడల మీ ఆశ, ఆశయము ప్రకారము ఈ విషయాన్ని నేను అంత తేలికగా మాత్రము తీసుకోను.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:20, 14 నవంబర్ 2010 (UTC)
జ్యోతిష్యము
[<small>మార్చు</small>]- లగ్న స్థానము నుండి ద్వాదశ స్థానముల 12 రాశుల్లో వున్న గ్రహ గతుల ననుసరించి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రస్తుతము నడుస్తున్నకొన్ని జాతక వివరములు వారికి సంబందించిన వివరములు చూడకుండా కూడా తను, షష్ట, వ్యయ, తదితర స్థానములు, గురు, చంద్ర, కుజ గ్రహగతులను బట్టి చెప్పవచ్చండి.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:29, 15 నవంబర్ 2010 (UTC)
- రాశి చక్రం నవాంశ చక్రం చూసి ఎవరికైనా కష్ట నష్టములు తదితరాలు చెప్పవచ్చు. --T.sujatha 15:28, 15 నవంబరు 2010 (UTC)
శశికాంత్ గారు బాధ పడకండి
[<small>మార్చు</small>]- మీరు ముందు ప్రశాంతముగా వుండండి. నిజం నిలకడ మీద తెలుస్తుంది.
- జమ్ బో జాయిను అయినది 3.11.2010, దానికి అంగీకార పత్రము మీరే అతనికి పంపించారు. అదే రోజు ఎంతో అనుభవము వున్న వాడిలా అందరి మీద అంత పెద్ద విమర్శలు చేయడము. లింకు చూడండి: http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:Jambo
(తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png శశికాంత్ 11:51, 3 నవంబర్ 2010 (UTC))
- జంబో విమర్శ మొదటి సమయము:16:16, నవంబర్ 3, 2010 (తేడాలు • చరితం) చి వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు) (→వీకీ పీడియా
- జంబో విమర్శ చివరి సమయము: 10:13, నవంబర్ 4, 2010 (తేడాలు • చరితం) వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు) (→వీకీ పీడియా తెలుగు నిర్వాహకులారా... మీకు రోషం ఉందా...)
- దీన్ని బట్టి జాయిన్ అయిన రోజునే అంతలా విమర్శలు చేశాడంటే కేవలము అందు కోసమే అని స్పష్టముగా అర్ధమవుతున్నది. విమర్శల కోసం జంబో వచ్చాడు. శశికాంత్ అనుమతివ్వడము జరిగింది.
- శశికాంత్ జవాబు సమయము: --శశికాంత్ 11:49, 3 నవంబర్ 2010 (UTC)
- జంబో అడ్రస్సు ఇప్పటికయినా యెవరికయినా తెలుసాండీ ?
- శశికాంత్ గారు మీకు ఇచ్చిన విషయాలన్నీ జంబోని మీరు ప్రశ్నించండి.
- పనులు యేమీ చేయని వారు పనికి రాని ప్రశ్నలు వేస్తునే వుంటారు. అలాంటి వారికి జవాబులు చెప్పనవసరము లేదు. వున్న కాస్త సమయము నలుగురికి వుపయోగించుదాము.
- చాలా మంది మన వారి మనసుల్లోని భావాలు అర్ధం చేసుకుంటున్నారు.
- అడ్రసులు లేని వారితో వచ్చే సమస్యలు ఎలా వుంటాయో, ఎలాంటి నీలాపనిందలు వస్తాయో, ఒకరొకరి మనసులు బాధలు పడతాయో గ్రహించాము. దీనికి పరిష్కారము చూడవలసిన అవసరము ఎంతైనా వుంది.
- ఎవరో వ్రాశిన దానికి మీరు ఇక్కడకు కావాలని రాకపోతే అది చాలా పొరపాటు.
- సలహాలు, సూచనలు, పదాల రూపంలో పలకరింపులు, ఇలా అందరూ మాట్లాడుకోవాలి.
- అందరము ఒకే ఆశ, ఆశయాలతో పని చేస్తున్న ఎందరో మహానుభావులు వున్నారు.
- ఇంతటితో ఈ విషయాన్ని దయచేసి అందరూ మరచిపోగలరు.
- సదా మీ అందరి శ్రేయస్సును, అభివృద్దిని కోరుకుంటూ.............
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 19:00, 15 నవంబరు 2010 (UTC)
జంబో విమర్శలు
[<small>మార్చు</small>]- నేను పూర్తిగా చదివిన తరువాతనే చాలా రోజుల తరువాత ఆ విషయన్నిచూశాను అప్పుడు వెంటనే వ్రాయాలనిపించి వ్రాశాను.
- మీరు కాదు అని అన్నారు, దానికి విపులముగా వివరణలు కూడా తెలియజేశారు.
- నేను మిమ్మల్ని ఏక వచనముతో సంభొదించ లేదు.
- నేను మిమ్మల్ని ఇంకా అనుమానించటము లేదు. జరిగిన విషయాలు తెలియ చేసాను.
- అనుభవము నాకు లేదు అంటే నాకు అర్ధము కాలేదు.
- నేను సగం సగం చదివి వ్రాయలేదు. ఇప్పుడు మీరు వ్రాశిన విషయాలలోని ఆంతర్యం మీరు అర్ధం చేసుకుంటున్నారా ? మీ మనసుని స్థిమితముగా వుంచగలరు.
- మీ పదాలలో కాఠిన్యం కనబడుతోంది.
- నేను సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగము చేసిన విశ్రాంత ఉద్యోగిని, ప్రపంచ అనుభవానికి తక్కువేమీ లేదు. నాకు ఒకరు చెప్పనవసరము లేదు లెండి. అంత అర్ధము కాని వాళ్ళము కాదు. మీ ప్రస్తుత రచనలు మళ్ళీ మీరే ఒకసారి చూసుకోండి.
- కొత్త వాళ్ళు కాదు వ్రాశింది. పాత వాళ్ళే కొత్తగా వచ్చి వ్రాశినట్లు వుంది.
- నేను ఇంతటితో వదిలి వేయటము జరిగిందని ముందే చెప్పాను.
- అసలు ఆ విమర్శలలోని అర్ధాలు గురించి ఎవరయినా అలోచిస్తున్నారా అని కూడా ప్రస్తావించాను.
- ఈ విషయములో మిమ్మల్ని మంచిగానే అర్ధం చేసుకున్నాను. నేను అందర్నీ అలానే అనుకుంటాను.
- ఇందు మూలముగా మీ అందరకూ తెలియజేయునది ఏమనగా, శశికాంత్ అనే నా తోటి సభ్యుని మనసు నా అనుమాన పద విషయ వాక్యములతో బాధ కలిగించేటట్లు చేసి ప్రవర్తించి నందులకు బేషరుతుగా, వారి మీద నేను చేసిన అరోపణలు సరి అయినవి కావని, అవి వారు చేసిన వ్యాఖ్యానాలు కావని రూఢిగా సుస్పష్ట దృగ్గోచరమయిన పిదప పొరపాటును ఉపసంహరించు కుంటున్నాను.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 03:51, 16 నవంబరు 2010 (UTC)
వర్గాలకు భాషా అనువాదాలు
[<small>మార్చు</small>]Sujatha garu,
- వర్గాల వాటికి కూడా భాషా అనువాదాలు ఇస్తున్నాను. దయచేసి చూడగలరు.
- ఉదా: "'వర్గం:పురాణాలు"' చూడగలరు.
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ 02:55, 17 నవంబరు 2010 (UTC)
- చూసాను బాగుంది.--T.sujatha 03:42, 17 నవంబరు 2010 (UTC)
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]Sujatha garu,
- ""ఆకు"" పదము::
- సామెతలు వర్గం ఇక్కడ తీసుకున్నాను.
- కొన్ని పదాలలో సామెతలతో లింకు ఇస్తున్నాను.
- Ex:- ఆకు పద ప్రయోగాలు దయచేసి చూడగలరు.
- అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది
- ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:07, 17 నవంబరు 2010 (UTC)
మంచి చర్చలు జరగాలి
[<small>మార్చు</small>](to whom so it ever concern) వికీపీడియా చర్చలకు నా జవాబు:
- మొత్తం అంతా చదివాను. చర్చలకు వేదిక అని అనుకుంటే అసలు సమస్య లేనే లేదు. కానీ అర్ధము లేని వృధా ప్రయాస చర్చల వల్ల ఉపయోగము ఎవరికీ వుండదు.
- జంబో చర్చించాలంటే ఇది సరి అయిన మార్గము కాదనుకుంటాను. మీరు వేడుక చూడటము యేమంత బావుండ లేదు.
- యాంత్రిక వ్యాసాలంటే నాకు మాత్రము ఎటువంటి అభ్యంతరము లేదు.
- ఎవరికైనా దొరికిన కాస్త సమయమైనా సద్వినియోగము చేసుకోవాలని, పదిమందికి తన జ్ఞానాన్ని పంచి పెట్టాలని కేవలము (ఇక్కడ) వికీకు వస్తారు. అది కూడా ఈషణ్మాత్రము ఏమీ ఆశించక చాలా మంది మంచి మనసులతో రావడము జరుగుతుంది.
- నేను చాలా వెబ్ సైట్ల వాటిల్లో గత 8 సం. వుంటూ, అనేక వందల మంది స్నేహితులు నాకు వున్నారు. అందులో నాకు ఎవరూ తెలియదు. ఇప్పటికీ వారంతా మంచి "ఆకాశ స్నేహితులు" . కారణము, నాకు నిజ జీవితములో స్నేహితులు లేరు. అందులోనూ నాకు మగ వాళ్ళంటే భయం, అందుకేనేమో నా సమాధానములు వారి మనసుకు నచ్చినట్లుగా ఉండవు.
- నేను తరచుగా ప్రయాణాలు చేస్తునే ఉంటాను. హైదరాబాదులో ఎక్కువ రోజులే వుంటాను. ఈ సారి తప్పకుండా కలుద్దాము. (ఎలా కలుస్తామనే ప్రశ్న రాదు. Arjunaraoc దగ్గర నా ఈ మెయిల్ అడ్రస్సు వుంది, నా ఫొన్ నం., కార్ నం. ఇస్తాను.)
- అనవసరముగా కేవలము వృధా సమయ చర్ఛలు చేసుకునేందుకు కావలసిన వెబ్ సైట్లు వున్నాయి.
- జంబో ఉదహరించిన విషయాల మీద చర్చించమంటే ఎవరూ ఆ విషయము మాట్లాడరు. కేవలము వ్యక్తిగతంగా తేసుకుంటున్నారు.
- నేను మొత్తము (జంబో+శశికాంత్ చర్చ కలిసి వున్నది) చదివిన తరువాత, సహజముగానే ఎవరి మనసు అయినా బాధ పడుతుంది. అయినా నేను యధాలాపంగా ఒకరోజు ఆ పాత చర్చ చూడటము జరిగింది. వెంటనే వ్రాశాను. ఆ తరువాత 3 రోజులకు అసలు విషయము నిదానముగా చెప్పారు. తరువాత, తరువాత ఆవేశము పెంచుకున్నారు.
- ఎవరైనా ఇక్కడకు రావడము అంటే చెడు అలవాట్లకు దూరముగా ఉండి, ప్రశాంత స్థితి, పరిస్థితులలో మంచి నడవడి, ప్రవర్తనలతో తన జ్ఞానాన్ని అందించాలని వస్తారు. అటువంటి వాతావరణము ఎల్లప్పుడూ వుండే విధముగా ముందు తప్పని సరిగా ప్రయత్నించాలి.
- ఇక్కడము రావద్దనే అధికారము ఎవరకైనా వుందేమో నాకు తెలియదు.
- నా పదాలు కొందరికి బాధ కలిగించాయి అని తెలియజేశారు, అందుకు తగిన విధముగా అందరికీ విషయాన్ని తెలియజేస్తూ నా పదాలని ఉపసంహరించుకుంటూ తెలియ జేయడము జరిగింది. కాని అర్ధం చేసుకొనక, మరో నాలుగు మాటలు చేర్చటముతో, చర్చ మరోలా సాగింది.
- ఎవరైనా ఏ విషయములో నయినా చర్చ చేయాలనుకుంటే ముందుగానే తెలియజేయండి. అది అందరికీ మంచిది. చర్చ మొదలు పెట్టిన వారు అందుబాటులో వుండే విధముగా చూసుకోండి.
- నేను పొరపాటు అన్న పదము తప్ప అంతకంటే ఎక్కువ బహుశః నాకు తెలిసినంత వరకు నేను యెక్కడ వ్యక్తిగతముగా వాడుట జరుగ లేదనుకుంటాను. అందుకే అంతకంటే ఎక్కువ పదము వాడను. ( ఏమో ఇంతవరకు ఎవరూ నా నుంచి అంతకంటే ఆశించ లేదు, ఆ సందర్భము రాలేదు)
- ఇంకా వివరణలు ముందు ముందు ముందు ఇస్తాను.
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ 07:48, 17 నవంబర్ 2010 (UTC)
విక్షనరీ మూసలో రూపాంతరాలు అనే ఉపశీర్షిక పెడదామా?
[<small>మార్చు</small>]ఈ ప్రశ్న విక్షనరీలో తెలుగు పదాన్ని జమ చేసేటప్పుడు వాడే మూస గురించి. ఇందులో రూపాంతరాలు అనే ఉపశీర్షిక పెడదామా? ఉదాహరణకి.. హడావిడి అన్న పదం జపచేస్తుంటే, హడావుడి, అడావిది(యాసలో) అన్నపదాలు సమానార్థకాలు. ఇలాంటివాటిని ఏ ఉపశీర్షికలో కలుపుతున్నారు? అలాగో మరో ఉదాహరణ, ఆవలింత, ఆవులింత...(యాసలు కలగలిసిన నేటి భాషలో పదేళ్ళ తరువాత ఏ పదంకోసం వెతుకుతామో మనం చెప్పలేం కదా?
బుడుగోయ్ 09:41, 25 జనవరి 2011 (UTC) చక్కటి సూచన కానీ రీడైరెక్ట్ కూడా మనం చెయ్యొచ్చు సమయం కుదిరితే చెప్తాను redirect చూడండి
Nani1only 20:42, 30 జనవరి 2011 (UTC)
- పదాలకు ఉన్న అన్ని విధముల యాసలను పదాలు అనే విభాగం నానార్ధాలు అనే ఉప విభాగంలో పొందు పరచ వచ్చు. విక్షనరీ ప్రధాన ఉద్దేశాలలో అన్ని రకాల యాసలను చేర్చడం కూడా ఒకటి.redirectచేయ కూడదు.--T.sujatha 08:40, 3 మార్చి 2011 (UTC)
పేజీ శీర్షిక మార్చడం ఎలా?
[<small>మార్చు</small>]విక్షనరీలో కొన్ని పదాలు కలుపుతున్నప్పుడు అసలు పదంలోనే తప్పులు దొరలాయి. దాంతో ఆ పదం శీర్షిక లోనే తప్పుగా వచ్చింది. పేజీలను మార్చడం, తీసివేయడం ఎలా బుడుగోయ్ 08:21, 3 మార్చి 2011 (UTC)
- తప్పులు దొర్లిన పదాలను తొలగించ వచ్చు, తరలించ వచ్చు లేని యడల వాటి స్థానంలో మార్పులు చేయ వచ్చు . --T.sujatha 08:34, 3 మార్చి 2011 (UTC)
- ఏదైనా ఉదాహరణతో చెప్పండి. హ్వానం అన్న పదం బదులు హ్వనం అని పడింది. సరిచేయడం ఎలా? బుడుగోయ్ 19:14, 3 మార్చి 2011 (UTC)
- తప్పుగా నమోదైన మాటలు తీసివెయ్యకపోతే నిఘంటువు వాడటానికి వచ్చినవారు ఈ పదాలను చూచి నిఘంటువు మీద తేలిక అభిప్రాయం ఏర్పరచుకోవచ్చు. డి.వి.ఎన్.శర్మ.
- ప్రత్యేక అక్షరాలలో వర్గమూలపు గుర్తు లేదు. క్రియామూలాలకు సంకేతంగా ఆ గుర్తు వాడటం ప్రచారంలో ఉంది.Dvnsarma 07:21, 20 మార్చి 2011 (UTC)డి.వి.ఎన్.శర్మ.
- మీరు పొరపాటు అనుకున్న పదాలను సూచించండి. అలాగే సరి అయిన పదాన్ని సూచించండి. పొరపాటున వ్రాసిన పదాన్ని సరి అయిన పదానికి నిర్వహకులు మారుస్తారు. కింద తప్పయిన పదాల పట్టికను ఉంచండి. మార్చవచ్చు.--T.sujatha 16:07, 20 మార్చి 2011 (UTC)
Call for image filter referendum
[<small>మార్చు</small>]The Wikimedia Foundation, at the direction of the Board of Trustees, will be holding a vote to determine whether members of the community support the creation and usage of an opt-in personal image filter, which would allow readers to voluntarily screen particular types of images strictly for their own account.
Further details and educational materials will be available shortly. The referendum is scheduled for 12-27 August, 2011, and will be conducted on servers hosted by a neutral third party. Referendum details, officials, voting requirements, and supporting materials will be posted at Meta:Image filter referendum shortly.
Sorry for delivering you a message in English. Please help translate the pages on the referendum on Meta and join the translators mailing list.
For the coordinating committee,
Philippe (WMF)
Cbrown1023
Risker
Mardetanha
PeterSymonds
Robert Harris
Terms of Use update
[<small>మార్చు</small>]I apologize that you are receiving this message in English. Please help translate it.
Hello,
The Wikimedia Foundation is discussing changes to its Terms of Use. The discussion can be found at Talk:Terms of use. Everyone is invited to join in. Because the new version of Terms of use is not in final form, we are not able to present official translations of it. Volunteers are welcome to translate it, as German volunteers have done at m:Terms of use/de, but we ask that you note at the top that the translation is unofficial and may become outdated as the English version is changed. The translation request can be found at m:Translation requests/WMF/Terms of Use 2 -- Maggie Dennis, Community Liaison 01:19, 27 అక్టోబరు 2011 (UTC)
Open Call for 2012 Wikimedia Fellowship Applicants
[<small>మార్చు</small>]I apologize that you are receiving this message in English. Please help translate it.
- Do you want to help attract new contributors to Wikimedia projects?
- Do you want to improve retention of our existing editors?
- Do you want to strengthen our community by diversifying its base and increasing the overall number of excellent participants around the world?
The Wikimedia Foundation is seeking Community Fellows and project ideas for the Community Fellowship Program. A Fellowship is a temporary position at the Wikimedia Foundation in order to work on a specific project or set of projects. Submissions for 2012 are encouraged to focus on the theme of improving editor retention and increasing participation in Wikimedia projects. If interested, please submit a project idea or apply to be a fellow by January 15, 2012. Please visit https://meta.wikimedia.org/wiki/Wikimedia_Fellowships for more information.
Thanks!
--Siko Bouterse, Head of Community Fellowships, Wikimedia Foundation 03:07, 22 డిసెంబరు 2011 (UTC)
Distributed via Global message delivery. (Wrong page? Fix here.)
పనిచేయని లిప్యంతరీకరణ
[<small>మార్చు</small>]https://bugzilla.wikimedia.org/show_bug.cgi?id=33467 బగ్ ఫైల్ చేశాను. --Arjunaraoc 10:48, 2 జనవరి 2012 (UTC)
- ధన్యవాదాలు. ఇప్పుడు లిప్యంతరీకరణ పనిచేస్తుంది. వికీపీడియా మాదిరిగా ఇప్పుడు విక్షనరీలో కూడా సవరణ పేజీలో నేరుగా రచనలు చేయవచ్చును.Rajasekhar1962 07:13, 23 జనవరి 2012 (UTC)
Announcing Wikipedia 1.19 beta
[<small>మార్చు</small>]Wikimedia Foundation is getting ready to push out 1.19 to all the WMF-hosted wikis. As we finish wrapping up our code review, you can test the new version right now on beta.wmflabs.org. For more information, please read the release notes or the start of the final announcement.
The following are the areas that you will probably be most interested in:
- Faster loading of javascript files makes dependency tracking more important.
- New common*.css files usable by skins instead of having to copy piles of generic styles from MonoBook or Vector's css.
- The default user signature now contains a talk link in addition to the user link.
- Searching blocked usernames in block log is now clearer.
- Better timezone recognition in user preferences.
- Improved diff readability for colorblind people.
- The interwiki links table can now be accessed also when the interwiki cache is used (used in the API and the Interwiki extension).
- More gender support (for instance in logs and user lists).
- Language converter improved, e.g. it now works depending on the page content language.
- Time and number-formatting magic words also now depend on the page content language.
- Bidirectional support further improved after 1.18.
Report any problems on the labs beta wiki and we'll work to address them before they software is released to the production wikis.
Note that this cluster does have SUL but it is not integrated with SUL in production, so you'll need to create another account. You should avoid using the same password as you use here. — Global message delivery 16:36, 15 జనవరి 2012 (UTC)