దశ-అవస్థలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంఖ్యానుగుణ పదములు
- వ్యుత్పత్తి
పది అవస్థలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- (అ.) 1. దీప్తి, 2. శాంతి, 3. మోదము, 4. స్వాస్థ్యము, 5. శక్తి, 6. పీడ, 7. దైన్యము, 8. వైకల్యము, 9. ఖలత్వము, 10. భీతి [ఇవి గ్రహముల అవస్థలు].
"దీప్తః శాంతో ముదితః స్వస్థః శక్తోః ప్రపీడితో దీనః, వికలః ఖలశ్చ భీతః ఏవం దశ గ్రహావస్థాః"
- (ఆ.) 1. ఇచ్ఛ, 2. ఉత్కంఠ, 3. అభిలాష, 4. చింత, 5. స్మృతి, 6. గుణ స్తుతి, 7. ఉద్వేగము, 8. ప్రలాపము, 9. ఉన్మాదము, 10. వ్యాధి.
- (ఇ.) 1. దృష్టిసంగము, 2. మనస్సంగము, 3. సంకల్పము, 4. జాగరము, 5. కృశత్వము, 6. అరతి, 7. హ్రీత్యాగము 8. ఉన్మాదము, 9. మూర్ఛ, 10. మరణోద్యోగము [ఇవి మన్మథావస్థలు].
"దృఙ్మనస్సంగసంకల్పా జాగరః కృశతారతిః, హ్రీత్యాగోన్మాద మూర్ఛాంతా ఇత్యనంగదశా దశ"
- (ఈ.) 1. గర్భవాసము, 2. జన్మము, 3. బాల్యము, 4. కౌమారము, 5. పౌగండము, 6. యౌవనము, 7. స్థవిరత్వము, 8. జర, 9. ప్రాణరోధము, 10. నాశము [ఇవి జీవుని దశలు].
- (ఉ.) 1. అపస్మారము, 2. ప్రేత సంభాషణము, 3. చిత్తభ్రమ, 4. శ్వాసమూర్ఛ, 5. ఊర్ధ్వదృష్టి, 6. రతికామన, 7. అంగదాహము, 8. నాలుక లోనికేగుట, 9. చెమట పట్టుట, 10. మరణము [ఇవి జ్వరావస్థలు].
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు