Jump to content

విక్షనరీ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD(2012)

విక్షనరీ నుండి

ఇక్కడ వోటు వెయ్యండి (31/01/2012) ముగింపు తేదీ : 24/01/201210:31 (UTC) ప్రారంభ తేది

ప్రతిపాదన

జెవిఆర్కె ప్రసాద్ - గారు విక్షనరీ అభివృద్ధికి చాలా కృషి చేశారు. వారు నిర్వహక బాధ్యత చేపట్టితే ఈ పథకాన్ని మరింత పురోగతి చేయకలుగుతారు ----అర్జున 10:37, 24 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

అంగీకారం

నా అంగీకారం తెలియజేయుచున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:10, 24 జనవరి 2012 (UTC)

మద్దతు
  1. --అర్జున 03:58, 25 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
  2. -- విక్షనరీ కొరకు విశేషకృషి చేస్తున్న JVRKPRASAD గారికి నా అంగీకారం తెలియజేస్తున్నాను.T.sujatha 03:27, 1 ఫిబ్రవరి 2012 (UTC)
  3. మంచి విక్షనరీ కృషి చేస్తున్న ప్రసాద్ గారి నిర్వహక అభ్యర్ధిత్వానికి నా మద్దతు తెలియజేస్తున్నాను.రాజశేఖర్
తటస్థం
‌వ్యతిరేఖం
ఫలితం

జెవిఆర్కె ప్రసాద్ సర్వసమ్మతితో ఎన్నికయ్యారు. దీనిని ఆచరణలోకి తెచ్చుటకు, స్టెవార్డ్ లకు తెలియచేస్తాను. JVRKPRASAD is elected unanimously. This will be brought to the notice of Stewards for implementation, as there is no active bureaucrat for Telugu wiktionary. --అర్జున 04:13, 2 ఫిబ్రవరి 2012 (UTC) మెటాలో వ్యాఖ్య ప్రకారం ఆరు నెలలవరకు నిర్వాహక హోదా ఇవ్వబడినది. --అర్జున 14:19, 2 ఫిబ్రవరి 2012 (UTC) {{subst: విక్షనరీ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/అభ్యర్ధి ప్రశ్నలు}}[ప్రత్యుత్తరం]

విక్షనరీ:నిర్వాహక హోదా కాలము పొడిగింపునకు విజ్ఞప్తి

[<small>మార్చు</small>]

తెలుగు విక్షనరీ సభ్యులందరికి నా మనవి. తెలుగు విక్షనరీనందు నా నిర్వాహక హోదా పైన తెలిపిన ప్రకారం ఆరు నెలల వరకు మాత్రమే ఇవ్వబడినది. తదుపరి తిరిగి మరల మీ అభిప్రాయములతో సర్వసమ్మతితో ఎన్నిక కావలిసి వున్నది. ఈ విధానము తెలుగు విక్షనరీ నందు సభ్యుల సంఖ్య పెరిగే వరకు కొనసాగుతుంది. అందు వలన నా నిర్వాహక కాలము పొడిగింపు అభ్యర్ధిత్వానికి తగిన విధముగా ప్రతిపాదించిన రోజు నుండి ఒక వారము రోజులలో మీ అభిప్రాయములతో ఎన్నుకొన (తెలియజేయ) గలరు.

  • తెలుగు విక్షనరీ సభ్యులందరికి నా మనవి. మీ అభిప్రాయము తెలియజేయ గలరు.
మీ ప్రణాలిక

ప్రసాద్ గారు. దయచేసి రాబోయే ఆరు నెలలలో మీ అభివృద్ధి ప్రణాలిక తెలియజేయండి. ఇతర సభ్యులను ఏ విధంగా ప్రోత్సహిస్తారో, ఏవిధంగా వర్గీకరణ చేపడతారో, ఈరోజు పదం నిర్వహణ ఎవరు చేస్తారు. ఏదైనా తెలుగు నిఘంటువును మొత్తంగా చేర్చాలనుకొంటున్నారా. ఇలాంటి వివరాలు తెలియజేస్తే సభ్యులు ఓటు వేయడానికి సానుకూలం అవుతుంది.Rajasekhar1961 (చర్చ) 09:42, 10 ఆగష్టు 2012 (UTC)

సభ్యులు అందరికి మనవి:రాబోయే కాలానికి అభివృద్ధి ప్రణాళిక గురించి సభ్యులు ప్రస్తావించ లేదు. గతించిన ఆరు నెలల కాలములో నేను చేసిన కృషి అందరికి తెలిసిన విషయమని అనుకుంటున్నాను. ఇప్పటికే వర్గాలను కొంత వరకు ఒక గాడిలో పెట్టడము, పదాలను సరియైన వర్గాలలో చేర్చడము, కొత్త పదాలను చేర్చటము జరిగినది. వర్గం:విషయాల వారీగా వర్గాలు, వర్గం:వర్గాలు, వర్గం:జాబితాలు, వర్గం:తెలుగు పదాలు ఇత్యాది వర్గాలను సభ్యులు చూడగలరు. ఈరోజు పదం ప్రస్తుతము సుజాత గారు చేపట్టి, చూస్తున్నారు. కనుక ఇబ్బంది లేదు. అన్ని తెలుగు నిఘంటువుల లోని పదాలు కొన్ని అయినా కొత్త పదాలు చేర్చినపుడు అందుబాటులోకి వస్తాయి. ఈ పైన ఉదహరించిన వివరాలు తెలియజేస్తే సభ్యులు ఓటు వేయడానికి సానుకూలం అవుతుంది అనే "'మీమాంస"' ఉన్నదని నాకు తెలియదు. ఎవరు అడగలేదు. నిర్వాహక హోదాకు కావలిసిన లక్షణాలు నాకు ఉన్నవో లేవో కూడా నాకు తెలియదు. కొత్తగా నిర్వాహక హోదాకు సభ్యులు ఎవరయినా ఆశిస్తూ ఉన్న యెడల నా మద్దతు తెలియజేయు చున్నాను. ఉన్న మరియు ఇక్కడకు వచ్చే సభ్యులు సంఖ్య బహుస్వల్పం కనుక, తదనుగుణముగా వారితో కలిసిమెలిసి తగు రీతిలో, అశాశ్వత (జీవితం) మయిన పదవుల కోసం, అంతా(అహం బ్రహ్మాస్మి:) నేనే, అని అనుకోకుండా, చర్చలు జరిపిన యెడల, జరుగుతున్న పనిలో నాణ్యత మరియు మరిన్ని నగిషీలు విక్షనరీ నందు చేయవచ్చును అని నా అభిప్రాయము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:59, 10 ఆగష్టు 2012 (UTC)
ప్రసాద్ గారు, మీరు ఇంతవరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మాకందరికీ తెలుసును. నేను రాబోయే కాలంలో చేయదలచుకున్న వాటి గురించి తెలియజేయమంటున్నాను. ఓటింగ్ అర్ధవంతంగా చేద్దామనే నా ఉద్దేశ్యం. అన్యధా భావించవద్దు.Rajasekhar1961 (చర్చ) 11:13, 11 ఆగష్టు 2012 (UTC)
రాజశేఖర్ గారు, మీరు కూడా ఏవో అభివృద్ధి కార్యక్రమాలు గురించి సభ్యులు తరపున ఆలోచించి ఉండవచ్చును. అవి మీరు తెలియజేసిన, నేను ఎంత వరకు చేయగలనో, సభ్యులను సంతృప్తి పరచగలనో తెలియచేయగలను. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా ఇక్కడ పొందు పరచండి. ఈ చర్చా విషయములో నాకు ఎవరి మీద ఎటువంటి అనవసరముగా అన్యధా భావించ వలసిన సంకుచిత కుత్సిత బుద్ది,మనసు ఉన్న స్థితి పరిస్థితులలో మాత్రము లేదని, నాది వయసును మించిన మనసు కాబట్టి అటువంటి సమస్య ఉత్పన్నము కాదు అని అనుకుంటున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 16:00, 11 ఆగష్టు 2012 (UTC)
మన చర్చ పై వారికి తెలియజేసినాను.[1] వారు ఏమంటారో అది కూడా చూద్దాము.
నిర్వాహక సమీక్ష

గత కొద్దికాలంగా నా అనుభవంలో ప్రసాద్ గారి నిర్వాహకత్వంనుండి నేను ఆశించిన పనులను సమీక్షించి క్రిందరాస్తున్నాను.

  • (+) నేటిపదం ప్రయోగంప్రారంభానికి జరిగిన చర్చలలో పాల్గొని సహకరించారు. దానికి సహకరించినవారికి అభినందించారు.
  • (+) తెలుగు వికీపీడియాలో పనిచేసే వారిని విక్షనరీలో చేరమని ప్రోత్సహించారు.
  • (-) నేటిపదం నిర్వహణకు ముందుకు రాలేదు. లేక చేయలేనని తెలియచేయలేదు. దాని ఫలితంగా దీని నిర్వహణపై అయోమయం నెలకొంది. గత 12 రోజూలనుండి నేటిపదం నిర్వహించబడక తెవికీ మొదటిపేజీ ఆహ్వానించేదిగా లేదు.
జవాబు: అసలు నేటిపదం అవసరము లేదని మీరే మొదట్లో అన్నారు. నేను ఎవరు లేని సమయములో "ఈరోజు పదము అని దానికి చాలా శ్రమ పడి చేశాను. అది మీకు నచ్చ లేదు. మీరు నేటి పదం మొదలు పెట్టారు. సంతోషము. ఎవరు నిర్వహిస్తారని మొదట్లో మీరు ఆడగలేదు. నేటి పదం పని పూర్తి అయిన పిదప అడిగారు. నాకంటే ముందు సభ్యురాలైన సుజాత గారు ఆ పని చూస్తానని చెప్పారు., మరి ఆ పని వారు చేస్తున్నారు. ఎందుకని ఆగిందో వారిని అడిగండి. చేయలేనని అని తెలియచేయ వలసిన అవసరము లేదు, ఎందుకంటే ప్రత్యేకంగా నన్ను ఒక్కడినే అడగలేదు. మొదటి పేజీలో ఎడమ ప్రక్క కొత్తపదము ఉంటే బావుండేది. నేటిపదం మీద మీరు చాలా శ్రద్ధ తీసుకున్నారు. అది మీ మానస పుత్రిక. నేను నిర్వహిస్తానని ఎలా అడ్డుపడతాను అని అనుకున్నారు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:12, 12 ఆగష్టు 2012 (UTC)
  • (-)విక్షనరీని అభివృద్ధిపరిచేదిశగా జరిగిన చర్చలలో (వేమూరి పదకోశం) స్పందించలేదు.
జవాబు:స్పందించలేదు అనడము మాట వెనక్కి తీసుకోండి. నన్ను చాలా విషయాలలో ఇబ్బంది పెడుతునే ఉన్నారు. మీరు బాట్ వాడమని అన్నారు. నాకు అంతగా తెలియలేదు. మీకు చాలా సార్లు అనేక సందర్భాలలో నేను సాఫ్ట్ వేర్ ఇంజనీరుని కాదు అని చెప్పాను. నన్ను ఒక్కడినే అడగలేదు. అది అందరికీ సంబందించినది.జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:17, 12 ఆగష్టు 2012 (UTC)
  • (-)తోటి సభ్యులు చేసిన మార్పుల గురించి పూర్తిగా తెలుసుకోకుండా, మరియు ఆధారాలు లేని ఊహాగానాలతో పరుషపదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటివి తెవికీలో నిర్మాణాత్మక వాతావరణం పెంచడానికి, ఉన్న సభ్యులను ప్రోత్సహించటానికి తోడ్పడలేదు.
జవాబు:నేను మీతోనే పరుషపదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేస్తాను. ఎందుకంటే ఎదుటి వారిని ముందు మీరే సరిగా అర్థం చేసుకోరు. తెలుగు వికీలో కూడా మీ చర్చలు అలాగే ఉంటాయి. మీరు సరిగా అడిగితే సమాధానము సవ్యముగానే ఉంటుంది. ఇంక మరెవ్వరితో నయినా అటువంటివి ఉంటే లింకు ఇవ్వండి. అర్జున తో చర్చలు ఎప్పటికీ వదలను. వదిలి పెట్టే సమస్య లేదు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:22, 12 ఆగష్టు 2012 (UTC)
  • ఇక సభ్యునిగా చేయగలిగినవాటిని అంటే వర్గీకరణ, కొత్త సభ్యులను ఆహ్వానపలకటం లాంటివి చేశారు.
  • అందువలన ప్రసాద్ గారు పైవాటికి స్పందించిమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 03:32, 12 ఆగష్టు 2012 (UTC)
జవాబు:నా పని ఎంత చూశారు ? ఏదో కొద్దిగా చూసి వ్రాయటము కాదు. అయినా ఇది రాజకీయ పదవి కాదు. సంజాయిషీలు ఇవ్వవలసిన ఉద్యోగము కూడా కాదు. ఇష్టము, అయిష్టము, ఇలాంటివి మీ అభిప్రాయములు తెలియజేయగలరు. దీని వలను నేను కోల్పోయేది ఏముంది. పని చేసే వాళ్ళు పోతే, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. నాకు పదవి కావాలని అడగలేదు, కావాలన్న కోరిక లేదు. పదవి లేకపోతే నా పని నాకు ఉంటుంది. పొడిగింపు చేసుకోమన్నారు, చేశాను. అసలు మీరు ఇక్కడకు వచ్చే హాజరు శాతము ఎంత ? మీరు చేశే పని ఏమిటి? ఒక మనిషి మేధస్సును లెక్క కట్టే అర్హతానుభవము మీకు ఉందంటే చాలా (ఆశ్చర్యము) సంతోషము. నాకు పదవి లేకపోయినా నా చర్చలు, పని అన్నీ సాగూతునే ఉంటాయి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:31, 12 ఆగష్టు 2012 (UTC)
మీ స్పందనకు ధన్యవాదాలు. అలాగే మీరు ఫోనుద్వారా నాతో చర్చించటానికి మొదటి ప్రయత్నంచేసినందులకు ఆ తరువాతి నా ప్రయత్నానికి సహకరించినందులకు కృతజ్ఞతలు. వికీలో జరిగిన సంఘటనవలన అపార్థాలేవన్నా వుంటే అది ఫోన్ ద్వారా పరిష్కరించుకోవటం మంచిమార్గమని నా నమ్మకం. పరస్పర అభిప్రాయాలు తెలుసుకొని సమాజానికి ఉపయోగపడే తెవికీ ప్రాజెక్టుల అభివృద్ధికి సహకరించటానికి అంగీకారము వ్యక్తమైంది అలాగే ఇలాంటి వాటిలో ఎవరికున్న పరిమితులు పంచుకుంటే అవగాహన పెరిగి సహకారం సులభమవుతుంది. అలాగే ఆధారాలతో, సుహృద్భావ వాతావరణంలో జరిగే చర్చలు ప్రాజెక్టు అభివృద్ధికి దోహదం చేస్తాయి. అందువలన పై చర్చలలో వ్యక్తపరచిన వాటికి కొన్ని అధారాలు వుటంకిస్తున్నాను. (అ) "అసలు నేటిపదం అవసరము లేదని మీరే మొదట్లో అన్నారు."- నేను నేటిపదాన్ని సమర్థించాను. వ్యాఖ్య చూడండి. ఇది చేసిన తరువాత మీరు ఈ రోజు పదం గురించి చేసిన కృషి నాకు తెలియదు. అయితే నేటిపదం తేజు తో ప్రారంభించినప్పుడు మీ కృషి నాదృష్టికి వచ్చింది. అప్పుడు మీ అనుభవం తేజుతో పంచుకొని అభివృద్ధిచేయమని సూచించడం జరిగింది. ఆ తరువాత నేటిపదం నిర్వహణ అభ్యర్థన మొదటిసారి, అభ్యర్థన రెండవసారి చేయడం జరిగింది. మనమందరము సమిష్టిగా పనిచేస్తే నే ప్రాజెక్టు అభివృద్ధి అవుతుంది. ఒకరు ప్రారంభిస్తే వారే చెయ్యాలనుకుంటే భావం వుంటే వికీ ప్రాజెక్ట్లు అభివృద్ధి కాలేవు. (ఆ) "స్పందించలేదు అనడము మాట వెనక్కి తీసుకోండి. ", దీనిని నేరుఅర్థంగా తీసుకుంటే వెనక్కితీసుకుంటాను. ఎందుకంటే మీరొకసారిస్పందించారు. భావాత్మక(in the spirit) అర్థంలో, దీనికి ముఖ్యమైన పదచట్రానికి ఏకాభిప్రాయ చర్చలలో ఏకాభిప్రాయం కుదరటానికి (విక్షనరీ_చర్చ:మూలస్వరూపం, విక్షనరీ_చర్చ:వేమూరి_పదకోశం ) స్పందించలేదు. అయితే మీరు చేస్తున్న కృషిని గుర్తించి ఆ తరువాత నిర్వాహకుని స్థాయికి ప్రోత్సహించిన నేను మీతో గౌరవంతో ప్రవర్తించాను. ఒకవేళ ఏదైనా అలా వ్యవహరించని సందర్భం వుంటే ఆధారం తెలియచేయండి. నేను బేషరతుగా క్షమాపణచెప్పగలను. మీపని పై ఇతరుల విమర్శను మీరు అపార్థం చేసుకొనటవలన ఈ బేధాబిప్రాయ జరిగిందని అనుకుంటున్నాను. వికీ అభివృద్ధి సమిష్టి కృషి కాబట్టి మీరు విమర్శలను ఎవరి వ్యక్తిత్వాలకి అన్వయించకపోతే మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఇక మీ నిర్వాహకుని హోదా అభ్యర్థిత్వం నుండి విరమణ వ్యాఖ్య చూసి బాధపడ్డాను. ప్రాజెక్టు నిర్ణయాలు అందరి అభిప్రాయాలు పై అధారపడతాయి. నా ఒక్కడి వ్యాఖ్యపై కాదుకదా. మీరు మీ నిర్ణయాన్ని మరల పరిశీలించి తెలుగు విక్షనరీలో మీ కృషి కొనసాగించాలని కోరుతున్నాను. నా వ్యాఖ్యలు సదుద్దేశంతో చేసినా మీ మనస్సు నొప్పించటం జరిగినందులకు నేను బాధపడుతున్నాను. ముందు ముందు అభిప్రాయ బేధాలు మర్యాదకరమైన వికీ లేక ఫోన్ చర్చలు ద్వారా పరిష్కరించుకోగలమని మనం వికీ స్నేహితులుగా కొనసాగాలని కోరుకుంటున్నాను--అర్జున (చర్చ) 07:37, 14 ఆగష్టు 2012 (UTC)
(అ), (ఆ) మీ వ్యాఖ్య నేటి పదం దగ్గర చర్చకు రండి. అన్ని విషయాలు అక్కడ తెలుస్తాయి. మీరెవరు, నేనెవరు అసలు. ఇక్కడకు రోజూ రావాలని లేదు. అలాగే అన్ని చర్చలలో పాల్గొనలని ఉందా ? ఎవరు, ఎప్పుడు, ఎందుకు చర్చలు చేస్తారో ఎవరికీ తెలియదు. ప్రతిసారి నన్ను స్పందించమని ఒత్తిడి గోల ఎందుకు చేయడము ? ఇంతకు పూర్వము ఏ చర్చ జరిగిందో అందరూ తెలుసుకుంటున్నారా ? వారు స్పందిస్తున్నారా ? నేను రాకపోతే బలవంతముగా తీసుకు వస్తారా ? నాతో పని చేయిస్తారా ? మొదటి ప్రధాన పుటని పూర్తిగా మీరే రూపు చెడగొట్టారని అంటే మీకు ఎక్కడ లేని కోపముతో, కసి తప్పకుండా వస్తుంది. నేను అసలు అన్నింటికీ స్పందించను. మీ బాధ ఏమిటి ? మీ అనవసర చర్చల వలన చేద్దామనుకున్న పని కూడా చేయలేక పోవడము జరుగుతోంది. చర్చలు కావాలని నేను ఎప్పుడూ చెబుతాను. కాని నిరంకుశముగా పని ఎవరితోనూ చేయించ లేము. మీతోనే అనవసరపు చర్చలు. ఎవరితోనూ లేవు. ఉంటే చూపించమని చాలాసార్లు చెప్పాను. (ఇ) సలహా బాగుంది, అవి త్వరలో అయిపోతాయి కాబట్టి దాని తరువాత వత్తులు చేపట్టవచ్చు. అక్షరాలు తర్వాత దశ నిర్వహణని ప్రసాద్ గారు చేపట్టితే బాగుంటుంది? ఈ వాక్యాన్ని ఎవరు, ఎప్పుడు, ఎవరిని ఉద్దేశించినదో తగిన సమయ కాల సమాచారము ఇవ్వండి. మీ మాట పద్దతి రెండూ, దానితో పాటు చివరికి పదాల పొందు పరచే ప్రస్తావనలో కూడా ప్రస్తుతము నడిచే ఈ కాలములో పొంతన పొసగడము లేదనుకుంటున్నాను. కొంత కాలానికి కాలమే జవాబు చెబుతుంది. చర్చ చేయాలనుకుంటే చేయ వచ్చును. నాకు అవసరము లేదు. నా చర్చ ముగిస్తున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:49, 14 ఆగష్టు 2012 (UTC)
"'మీరు ఈ రోజు పదం గురించి చేసిన కృషి నాకు తెలియదు. అయితే నేటిపదం తేజు తో ప్రారంభించినప్పుడు (1) మీ కృషి నాదృష్టికి వచ్చింది. అప్పుడు మీ అనుభవం "':: ఇది అర్జున (చర్చ) 07:37, 14 ఆగష్టు 2012 (UTC)లోని ఒక భాగము. నిజానికి ఈయనకు తేజు ప్రారంభానికి ముందే ఈ రోజు పదం గురించి చేసిన కృషి "'14. ఈ రోజు తెలుగు తల్లి పాట'" [2]లోని అర్జున 09:37, 7 ఫిబ్రవరి 2012 (UTC) స్పందన చదవ వచ్చును. (2) సలహా బాగుంది, అవి త్వరలో అయిపోతాయి కాబట్టి దాని తరువాత వత్తులు చేపట్టవచ్చు. అక్షరాలు తర్వాత దశ నిర్వహణని ప్రసాద్ గారు చేపట్టితే బాగుంటుంది? ఈ "'వాక్యాలు 3 నేటిపదం అక్షరపదాలు"' [3]చర్చలోని భాగాలు గా ఉన్నాయి. ఈ వాక్యాలని ఎవరు, ఎప్పుడు, ఎవరిని, ఎవరితో చర్చ ఉద్దేశించినదో తగిన సమయ కాల సమాచారము ఇవ్వండి అర్జున అని అడిగినా ఇంతవరకు సమచారము ఇవ్వ లేదు. దానికి ఏమనుకోవాలి ? జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:29, 18 ఆగష్టు 2012 (UTC)[ప్రత్యుత్తరం]
అంగీకారం

నా అంగీకారం తెలియజేయు చున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:37, 29 జూలై 2012 (UTC)

మద్దతు

నా మద్దతు తెలియజేస్తున్నాను. --T.sujatha 13:59, 10 ఆగష్టు 2012 (UTC)

తటస్థం


‌వ్యతిరేఖం


ఫలితం
విరమణ: ఏ కాలమునకు మరియు ఇప్పటి వరకు తోటి సభ్యుల నుండి సరి అయిన స్పందన లేనందు వలన ప్రస్తుతానికి నా విక్షనరీ:నిర్వాహక హోదా కాలము పొడిగింపునకు విజ్ఞప్తిని ఇంతటితో విరమించుకుంటున్నాను. నాకు మద్దతు తెలియజేసిన శ్రీమతి.సుజాత గారికి ధన్యవాదములు తెలియజేయుచున్నాను.జె.వి.ఆర్.కె.ప్రసాద్ 09:59, 13 ఆగష్టు 2012 (UTC)