apply
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - క్రియ, నామవాచకము, సరిపడుట, ఉపయోగించుట, చెల్లుట, తాకుట.
- If you will not apply you cannot learn శ్రద్ధలేకుంటే నీకు రాదు.
- he applied to me for the money నన్ను ఆ రూకలు అడిగినాడు.
- that proverb does not apply to him యీ సామెత వాడికి తగదు.
- or to request అడుగుట, కోరుట or to study మనసు వుంచుట, ఆసక్తమై వుండుట.
- this rule does not apply here : ఆ సూత్రము యిక్కడ వుపయోగించదు.
- he does not apply to business : పనిలో వాడు శ్రద్ధగా వుండటము లేదు.
- your remarks do not apply to me : నీవు చెప్పిన మాటలు నాకు తాకలేదు.
- క్రియ, విశేషణం, వేసుట, పూసుట, చరుముట, వొత్తుట, అంటించుట.
- he applied the cautery to the horse ఆ గుర్రానికి వాత వేసినాడు.
- he applied this word erroneously ఆ శబ్దమును తప్పుగా ప్రయోగించినాడు.
- he applied medicine to the wound ఆ పుంటికి మందు వేసినాడు.
- he applied plaister to the wall గోడకు సున్నము పూసినాడు.
- or to appropriate వినియోగపరచుట, ఉపయోగపరచుట.
- they applied this proverb to him యీ సామెత వాడికి సరియన్నారు.
- he applied himself to this study although he hated it దాని మీద వాడికి మనసు లేకపోయినా శ్రద్ధగా చదివినాడు.
- he applied himself to Sanskrit సంస్కృతములో శ్రద్ధుడై వుండినాడు.
- the applied meaning of a word రూఢ్యర్థము, ప్రయోగితార్థము.
- as distinguished from the original sense ధాత్వర్థము, మూలార్థము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).