lay

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, పండుకొని వుండుట, ఉంచుట.

 • he lays about him with a whip చబుకుతో తన చుట్టు విసురుతాడు.
 • the ships lay to for onee day వాడలువొకదినమంతా పోకుండా నిలిచి విండినవి.

నామవాచకం, s, a song కావ్యము, పాట. బద్ధం విశేషణం, లౌకికపు.

 • in this society there are four clerical members and five lay members ఈ సభలో నలగురు వైదికులున్ను అయిదుగురు లౌకికులున్ను వున్నారు.
 • alay man లౌకికుడు, వైదికులున్ను కానివాడు.
 • lay-brother సన్యాసిచేతికింద వుండేయేకాంగి.
 • the law-lords and the lay-lords జడ్జీ లున్ను కడమ వాండ్లన్ను.

pastofLie, ఉండినది,పండుకొన్నది, he lay on his face బోర్లపడి వుండినాడు. క్రియ, విశేషణం, ఉంచుట, పెట్టుట, వేసుట.

 • he laid the mats చాపలు పరచినాడు,వేసినాడు.
 • she laid yellow paint on her cheeks ముఖానికి అరిదళముపూసుకొన్నది.
 • he was laying the floor తళవరసవేస్తూ వుండినాడు.
 • he laid the floor of the room with planks ఆ ఇంటికి తళవరస పలకలతో కూర్చినాడు.
 • they have laid a road between these villages ఈ వూళ్ళ నడమ భాట వేసినారు.
 • the rain has laid the wind వర్షము చేత గాలి అణిగినది.
 • the rain laid the dust వర్షము దుమ్మునుఅణిచినది.
 • he laid the spear against the wall ఆ యీటెను గోడకు ఆనించినాడు.
 • I laid an ambush of ten men near the town ఆ వూరి దగ్గెర పదిమందికి పొంచుపెట్టినాను.
 • he laid aside this intention ఈ ఆలోచనను మానుకొన్నాడు,విడిచిపెట్టినాడు.
 • the storm laid the field bare, or waste, గాలివాన చేత ఆపొలము పాడైపోయినది.
 • he laid this petition before the king ఈ ఆర్జీని రాజుకిచ్చినాడు.
 • he laid a bet పందెము వేశినాడు.
 • he laid the blame upon me ఆ తప్పు ను నా మీద పెట్టినాడు.
 • he laid by the money ఈ రూకలను భద్రము చేసినాడు.
 • he laid a claim to this estate ఈ ఆస్తి తన్ను చెందవలసినదన్నాడు, ఈ ఆస్తికి వాజ్యము చేసినాడు.
 • he laid his commands upon me to go there నన్ను అక్కడికి పొమ్మని ఆజ్జాపించినాడు.
 • he laid down four branches from the vine ఆద్రాక్షతీగెలలో నుంచి నాలుగుకొమ్మలను పాదు చేసినాడు.
 • he laid down the law వాడువిధించినాడు, విధించి చెప్పినాడు.
 • he laid him down and slept పండుకొని నిద్రపోయినాడు.
 • I am not going to lay down the law నేను వొకటిన్ని విధించి చెప్పబొయ్యేదిలేదు.
 • he laid down his life for them వాండ్లకై తన ప్రాణము ను విడిచినాడు.
 • thee insurgents laid down their arms దివాణాన్ని యెదిరించిన వాండ్లు అస్త్రసన్యాసము చేసుకొన్నారు.
 • the fowl lays eggs కోడిగుడ్లు పెట్టుతున్నది.
 • by spells he laid the ghost మంత్రము చేత ఆ దయ్యము ను కట్టుకట్టినాడు.
 • if you can lay your hand on the book ఆ పుస్తకము నీకు చిక్కితే, ఆ పుస్తకము నీకుతగిలితే.
 • he laid violent hands upon the money ఆ రూకలను అపహరించినాడు.
 • he laid hands on himself హత్య చేసుకొన్నాడు.
 • the bishop laid bands on themగురువు వాండ్లను చేత ముట్టి దీవించినాడు.
 • he laid hold of my band నా చెయ్యిపట్టుకొన్నాడు.
 • they laid him in his fathers grave తండ్రిని పెట్టినచోటనే వీణ్నిన్ని పెట్టినారు.
 • he laid in a stock of corn వాడు నిండా ధాన్యము ను కట్టిపెట్టినాడు.
 • hee desired them to lay one కొట్టుకొట్టు అన్నాడు.
 • he laid the wound open ఆ పుంటిని శస్త్రము చేసినాడు.
 • he laid himself open to remark వాడేఆక్షేపణకు యెడమిచ్చినాడు, అవకాశమిచ్చినాడు.
 • he laid out the articles for inspection ఆ సామానులను అంగట్లో పెట్టినాడు.
 • he laid out the ground as a garden ఆ నేలను తోట గా యేర్పరచినాడు.
 • he laid himself out for sin పాపానికి వొడికట్టినాడు.
 • he laid a plan to catch them వాటిని పట్టడానికి వొకతంత్రమును పన్నినాడు.
 • he laid siege to the town ఆ పట్నానికి ముట్టడివేసినాడు.
 • he lays great stress upon this ఇది మహా ముఖ్య మంటాడు.
 • she laid a table for twelve పన్నెండు మందికివంటకాలు సిద్ధము చేసినది.
 • he laid a tax upon them వాటికి పన్ను వేసినాడు.
 • he laid these words to heart ఈ మాటలను మనస్సులో పెట్టుకొన్నాడు.
 • you should not lay these words to heart ఈ మాటలను నీవు మనస్సులో పెట్టవద్దు.
 • they laid their heads together వాండ్లంతా కూడి ఆలోచించినారు.
 • he laid us under contribution మాకు చందావేసి నాడు, అనగా చందా వేసి మమ్ముల దోడుకొన్నాడని అర్థము.
 • this wound laid h;im up for fortnight ఈ పుంటిచేతపదిహేను దినములు పడ్డపడకగా వుండినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lay&oldid=936590" నుండి వెలికితీశారు