right
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ఒప్పైన, తగిన, మంచి, సరియైన, న్యాయమైన, యుక్తమైన, అర్హమైన.
- rightconduct మంచి నడక, న్యాయమైన నడక.
- this is not right యిది న్యాయము కాదు.
- this account is not right యీ లెక్క బాగా వుండలేదు, సరిగ్గా వుండలేదు.
- you are right నీవు చెప్పినదే సరి.
- I do not know if it is right or wrong అది తప్పో వొప్పో నాకు తెలియదు, అది సరో సరికాదో నాకు తెలియదు.
- this is right యిది న్యాయమే యిది సరే.
- as far as is right తగు మాత్రముగా.
- that is not his right name యిది వాడికి నిజమైన పేరు కాదు.
- the right way సరియైన దారి క్రమమైన మార్గము.
- he does not know the right way to do it దాన్ని చేయడానకు వాడికి సరి యైన దారి తెలియదు.
- he was formerly mad, he is now in his right mind వాడికి మునుపు వుండిన పిచ్చి తీరి యిప్పుడు తెలివిగా వున్నాడు.
- he was sitting clothed and in his right mind చక్కగా బట్టలు తొడుగుకొని పిచ్చి కళలు లేక తెలివిగలవాడై కూర్చుండివుండెను.
- not left కుడి, the right hand కుడి చెయ్యి.
- on the right side కుడి ప్రక్కన.
- he is my right hand man వాడే నాకు మంత్రి, వాడు వుంటేనే గాని నాకు యేపన్నీనిగడవదు, వాడు నాకు హస్తకుడు.
- the right hand caste కుడిచేతి వాండ్లు.
- he found fault with them all right and left వీడు వాడని చూడక అందరికిన్నీ చీవాట్లు పెట్టినాడు.
- he sold all his books right and left యిది అది అని చూడక పుస్తకాలన్నిటిని అమ్మినాడు.
- a right line చక్కని గీత, వంకరలేని గీత.
- right angle or the corner of a square చతురశ్రమముగా వుండె దానిలో వొక కోణము, చతురశ్రకోణము.
- right angle సరిమూల.
- a square has four right angles నలుచదరమునకునాలుగు సరి మూలలు వున్నవి.
క్రియా విశేషణం, సరిగ్గా, చక్కగా, న్యాయముగా, బాగా.
- set it right దాన్ని సవరించు, చక్కగా పెట్టు.
- as he thinks right వాడికి యుక్తమైనట్టు.
- you did right నీవు చేసినది సరే, నీవు చేసినది న్యాయమే.
- it is right యిది విహితమే.
- this is not right యిది కారాదు, యిది మంచిది కాదు.
- it served you right యిది నీకు కావలశినదే, యిది నీకు తగిన శిక్షే.
నామవాచకం, s, Justice న్యాయము, ధర్మము.
- this is right that is wrong యిది సరి, అది సరికాదు, యిది సుబద్ధము, అది అబద్ధము, యిది న్యాయము, అది అన్యాయము.
- just claim, privilege స్వతంత్రము, బాధ్యత, కర్తృత్వము.
- he claims payment as his right తనకు చేరవలసిన బాధ్యత వున్నది గనక తనకు చెల్లించవలసిందంటాడు.
- you have no right to go to his house unless he invites you వాడు పిలిస్తేనే గాని వాడింటికి నీవు పోవడానకు స్వాతంత్రము లేదు.
- you have no right to punish him వాణ్ని దండించేటందుకు నీకేమి బాధ్యత.
- a child has a right to food and clothing అన్న వస్త్రములు పెట్టించుకోవడమునకు బిడ్డకు స్వాతంత్ర్యము వున్నది.
- a servant has a right to wages పనివాడికి జీతమును అడగడమునకు స్వాతంత్ర్యము వున్నది.
- a father has a right to the services of a child కావలసిన పనులను బిడ్డను కొని చేయించుకొనే బాధ్యత తండ్రికి వున్నది.
- he proved his right to the property ఆ సొత్తుయొక్క బాధ్యత తనకు వున్నదని నిరూపించినాడు.
- the rights of hospitality అతిధ్య ధర్మములు.
- honour is the right of a king అందరివల్ల పూజించబడవలసిన బాధ్యత రాజుకు వున్నది.
- he who has a right to that house ఆ యింటికిబాధ్యుడు.
- conjugal rights వివాహ ధర్మము, పెండ్లివల్ల భార్యా భర్తలకు కలిగిన బాధ్యతలు.
- power; prerogative స్వత్వము, అధికారము.
- opposed to left కుడిప్రక్క.
- he turned to the right కుడి ప్రక్క తిరిగినాడు.
- I dont understand the right of the question దాని నిజస్థితి నాకు తెలియదు.
- he put the books to rights ఆ పుస్తకాలను చక్కగా పెట్టినాడు.
- he put the house to rights ఆ యింటిని చక్కపెట్టినాడు.
క్రియ, విశేషణం, to restore a ship to her upright position వొక వాడ మళ్లీ యథాస్థితిని కుదురుగా నిలుచుట.
- the ship righted herself or the ship righted వొరిగిన వాడ మళ్లీ యెప్పటివలె సరిగ్గా నిలిచినది.
- he is righted వాడు న్యాయమును పొందినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).