మన్మథుడు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- మన్మథుడు నామవాచకము.
- వ్యుత్పత్తి
- మనస్సు నుండి పుట్టినవాడు.
మనసును కలత పెట్టు వాడు
- బహువచనం లేక ఏక వచనం
మన్మధుడు ఒక్కడే కనుక బహువచనము ఉండదు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మన్మథుఁడు అంటే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కలించే దేవత పుష్పబాణ హస్తుడు. మన్మధుడుని భార్య రతీదేవి. ఆంగ్ల సాహిత్యంలో కూడా మన్మధ ప్రసక్తి ఉంటుంది. ఆంగ్లసాహిత్యంలో మనధుడిని క్యూపిడ్ అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాపపథాలు
దేశ్య.
అయిదుకైదువులజంత, అలరుకైదువుజోదు, చందమామయల్లుడు, చక్కనయ్య, చక్కెరవింటిదేవర, చక్కెరవిలుకాడు, చిగురాకువిలుకాడు, చిగురుకైదువుజోదు, చిగురువిలుకాడు, చిలుకతత్తడిరౌతు, చిలుకపటాణిరౌతు, చిలుకపటానితేనిదొర, చిలుకరౌతు, చిల్కపటానీపాదుషా, చూడగలవాడు, చెరకువిలుకాడు, డెందముచూలి, తలపుచూలి, తలపుబిడారంపుబలియడు, తలిరుకటారికాడు, తలిరుజిరావజీరు, తలిరువిలుకాడు, తలిరువిల్తుడు, తామరతూపరి, తావివిలుకాడు, తియ్యవిలుకాడు, తియ్యవిలుతుడు, ననవింటిజోదు, ననవింటిదంట, ననవింటిదొర, ననవింటిమన్నెకాడు, ననవిలుకాడు, ననవిలుతుడు, ననసానాగడ కెంచెపుమాష్టీడు, నలువతమ్ముడు, నెయ్యపురేడు, నెలయల్లుడు, పచ్చనివింటిజోదు, పచ్చవింటిదొర, పచ్చవింటివాడు, పచ్చవార్వపుజోదు, పచ్చవింటిదునేదారి, పచ్చవిలుకాడు, పచ్చవిలుతుడు, పడుచుదనములపెద్ద, పువ్విలుకాడు, పువ్విలుతుడు, పువ్వువింటిజోదు, పువ్వులవిలుకాడు, పూజిల్కుదొర, పూదేరురాయడు, పూవింటిజేజే, పూవింటిజోదు, పూవింటివాడు, పూవిలుకాడు, పూవిలుతుడు, పూవుదూపులజోదు, బేసికైదువుజోదు, మొసలిటెక్కెముజోదు, మొసలిడాల్వేల్పు, రాచిల్కదొర, ఱెక్కసామ్రాణిదంట, వలదొర, వలపుదేవర, వలపుదొర, వలపురాయడు, వలపులరాచజోదు, వలపులరాజు, వలపులరేడు, వలపులవింటివాడు, వలరాచవాడు, వలరాజు, వలరాయడు, వలఱేడు, వాలుగడాలు, విరికటారపుజోదు, విరికొంతవేల్పు, విరివింటిదంట, విరివింటిదొర, విరివింటివాడు, విరివిలుకాడు, విరివిల్తుడు, వెడవింటిజోదు, వెడవింటిబలుదంట, వెడవింటిబోయ, వెడవింటిఱేడు, వెడవింటివాడు, వెడవిలుకాడు, వెడవి(ల్తు)(లుతు)డు, సంపంగికటారివీరుడు, సిరిచూలి, సిరిపట్టి
సం.
- పర్యాయ పదములు
- [మన్మథుడు] =అంగజుడు, అంగభవుడు, అంగభువు, అంగహీనుడు, అకాయుడు, అజుడు, అతనుడు, అనంగుడు, అనన్వజుడు, అభిరూపుడు, అయుగశరుడు, అయుగ్బాణుడు, అయుగ్మబాణుడు, అవ్యక్తుడు, అసమబాణుడు, అసమశరుడు, ఆత్మజన్ముడు, ఆత్మభువు, ఆత్మభూతుడు, ఆశయేశయుడు, ఇక్షుధన్వుడు, ఇక్షుశరాశనుడు, ఇష్ముడు, ఉదర్చి, ఋష్యకేతువు, కంజనుడు, కంతుడు, కందర్పుడు, కమనుడు, కర్వుడు, కామదేవుడు, కాముడు, కాయజుడు, కాయసంభవుడు, కింకిరాతుడు, కింకరుడు, కుసుమకోదండుడు, కుసుమధన్వుడు, కుసుమాస్త్రుడు, కుసుమేషువు, గదయిత్నువు, గృత్సుడు, గృధువు, చేతోభవుడు, చైత్రసఖుడు, చైత్రసారథి, జరాభీరువు, ఝషకేతుడు, ఝషాంకుడు, తీగవిలుకాడు, తుంటవిలుతుడు, తూటవిలుకాడు, తేటియల్లెవింటిదొర, దర్పకుడు, నాళీకబాణుడు, నిషద్వరుడు, పంచబాణుడు, పంచశరుడు, పంచేషువు, పటీరుడు, పల్లవాస్త్రుడు, పుండ్రేక్షుకోదండుడు, పుష్పకేతనుడు, పుష్పకేతువు, పుష్పధన్వుడు, పుష్పధ్వజుడు, పుష్పపత్రి, పుష్పబాణుడు, పుష్పశరాసనుడు, పుష్పశరుడు, పుష్పాయుధుడు, ప్రకర్షకుడు, ప్రద్యుమ్నుడు, ప్రసూనేషువు, బంధిద్రుడు, బ్రహ్మసువు, భావజుడు, భావభవుడు, మకరకేతనుడు, మకరకేతువు, మకరధ్వజుడు, మకరాంకుడు, మత్స్యలాంఛనుడు, మదనుడు, మదరాగుడు, మధుసఖుడు, మధుసారథి, మనఃప్రభవుడు, మనసిజుడు, మనసిశయుడు, మనోజుడు, మనోభవుడు, మనోభువు, మరుడు, మారుడు, మీనకేతనుడు, మీనకేతుడు, మీనాంకుడు, ముర్మురుడు, ముహిరుడు, రణరణకుడు, రతనారీచుడు, రతిపతి, రతిప్రియుడు, రతిరాట్టు, రతేశ్వరుడు, రమతి, రముడు, రవీషువు, రాగచూర్ణుడు, రాగరజ్జువు, రుద్రారి, రూపాస్త్రుడు, లక్ష్మీపుత్రుడు, లతాంతాయుధుడు, లతాంతాస్త్రుడు, వసంతబంధువు, వసంతయోధుడు, వసంతసఖుడు, వామశీలుడు, వాముడు, విలాసి, విషమశరుడు, విషమసాయకుడు, విషమాయుధుడు, విషమేషువు, విస్మాపనుడు, వైషమేషవుడు, శంకువు, శంబరసూదనుడు, శంబరారి, శర్వరుడు, శుకవాహుడు, శృంగారయోని, స్త్రీపుత్రుడు, సంకల్పజన్ముడు, సంకల్పయోని, సంసారగురువు, సారంగడు, సుప్రతీకుడు, సుమనస్సాయకుడు, సురభిసాయకుడు, సూనాస్త్రుడు, స్మరుడు, స్మృతిజాతుడు, స్వయంభువు, స్వాదుధన్వుడు, హృచ్ఛయుడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]