శివుడు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- శివుడు నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఈశ్వరుడు త్రిమూర్తులలో ఒకడు. లయ కారకుడు. ఆది దైవం.
- తెలుగువారిలో ఒక పురుషుల పేరు.
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయపదాలు
తెలుగు: అంగమోములవేల్పు, అగ్గికంటి, అయిదుమోములవేల్పు, అరమెయిజోటివాడు, అలరుసాయకువైరి, ఆబోతురౌతు, ఎద్దుతత్తడిజోదు, ఏకపాత్తు, ఏనుగుతోలుదాల్పు, ఏనుగురాకాసిగొంగ, ఐదుమోములవేల్పు, కప్పుగుత్తుకవాడు, కఱిమెడదొర, కాట్రేడు, కొండమల్లయ్య, కొండయల్లుడు, గట్టువిల్తుడు, గాములదొర, గిబ్బడాల్దొర, గిబ్బపటాణిరౌతు, గిబ్బబాబాజోదు, గిబ్బరౌతు, గుబ్బలివిలుకాడు, చిచ్చఱకంటి, చిలువతాలుపు, చిలువసొమ్ము, జంగమయ్య, జడదారి, జడదాలుపువేలుపు, జడముడిజంగము, జడలసికదేవర, జన్నపుగొంగ, జన్నపువేటకాడు, జాబిలితాల్పు, జాళువావింటివాడు, జింకతాలుపరి, జింకతాల్పు, జోటింగుడు, తిగకంటి, తుంగుడు, తెల్లనిదొర, తోలుదాల్పు, దిసమొలవేల్పు, దిస్సమొలదేవుడు, నింగిసిగ, నీరుతిట్టబత్తళికవజీరు, నెలతాల్పు, నెలదారి, నొసలిచూపువేల్పు, పునుకతాలుపు, పెనుజోగి, బంగరుగట్టువింటివాడు, బుడిబుడితాల్పుడు, బూచిమనలవాడు, బూచులదొర, బూచులరాయడు, బూచులఱేడు, బేసికంటి, బేసికంటివేల్పు, మరుగొంగ, మరునిసూడు, మాయలచెంచురాయడు, మిక్కిలికంటివేల్పు, మిక్కిలికంటిసామి, మిత్తిగొంగ, మిత్తివేటగాడు, మినుసికగలాడు, మినుసికదయ్యము, మినుసిగదేవర, మినుసిగవేల్పు, మిన్నువాకతాల్పు, ముక్కంటి, ముక్కనుసామి, ముమ్మొనవాలుదాల్పు, మూడవకంటివేల్పు, మూడుకన్నులయ్య, మూడుకన్నులవాడు, మూడుకన్నులవేల్పు, మెట్టువిల్వేల్పు, మొదలివేల్పు, వాకతాల్పుడు, వాకదాలుపు, వినుసిగదేవర, విన్నుమూలదేవర, విన్నేటితాల్పు, విసపుమేతరి, వెన్నెలవిరిదాల్పు, వేడికంటి, సంజుడు, సంబుడు, సగమాటదేవర, సితికంఠుడు, సె(క)(గ)కంటి, హెచ్చుకంటిదొర
సంస్కృతం: అంగజహరుడు, అంతకహరుడు, అంతకాంతకుడు, అంధకరిపువు, అంధకారాతి, అంబరకేశుడు, అంబరాంబరుడు, అంబరీషుడు, అక్షతుడు, అక్షరుడు, అక్షికౌక్షేయుడు, అఖిలగురుడు, అగస్త్యుడు, అగ్నివక్త్రుడు, అఘోరుడు, అచలుడు, అజితుడు, అజుడు, అథర్వణుడు, అథర్వుడు, అధ్యూడుడు, అనంగాహితుడు, అనంతలయుడు, అనలాంబకుడు, అనిరుద్ధుడు, అపరాజితుడు, అభవుడు, అభిరూపుడు, అర్ణవతూణీరుడు, అయుగనేత్రుడు, అయుగ్మనేత్రుడు, అయోనిజుడు, అరిందముడు, అర్ధనారీశ్వరుడు, అర్థేశసఖుడు, అలికాక్షుడు, అవ్యక్తుడు, అష్టమూర్తి, అసమనేత్రుడు, అసమాబకుడు, అసమాక్షుడు, అస్థిధన్వుడు, అస్థిమాలి, అహర్పతి, అహిభృత్తు, అహిర్బుధ్న్యుడు, ఆత్మభువు, ఆదిభిక్షువు, ఆదిశబరుడు, ఆర్యానాథుడు, ఇందుమౌళి, ఇందుశేఖరుడు, ఈశానుడు, ఈశుడు, ఈశ్వరుడు, ఉక్షధ్వజుడు, ఉగ్రధన్వుడు, ఉగ్రాక్షుడు, ఉగ్రుడు, ఉత్తరుడు, ఉదర్చి, ఉమాపతి, ఉష్ణీషి, ఊర్ధ్వరేతసుడు, ఊర్ధ్వశాయి, ఋతంబరుడు, ఋతధ్వజుడు, ఋషభధ్వజుడు, ఏకదిక్కు, ఏకదేవుడు, కంకటీకుడు, కంఠేకాలుడు, కటంకటుడు, కటప్రువు, కఠమర్దుడు, కద్రూజాంగదుడు, కపర్ది, కపాలధారి, కపాలభృత్తు, కపాలి, కఱకంఠుడు, కల్మషకంఠుడు, కాకోలగ్రీవుడు, కామారి, కారణకారణము, కాలంజరుడు, కాలకంఠుడు, కాలకాలుడు, కాలాంతకుడు, కాలాత్ముడు, కాశీనాథుడు, కురంగపాణి, కూటకృత్తు, కృత్తివాసుడు, కృషానురేతసుడు, కేదారుడు, కోకనదుడు, కోడెరౌతు, కోడెవయాళివజీరుడు, క్రతుధ్వంసి, క్రియాకారుడు, క్ష్వేళగళుడు, ఖండపరశువు, ఖట్వాంగధరుడు, ఖట్వాంగి, ఖరువు, గంగాధరుడు, గజరిపువు, గట్టురాజల్లుడు, గట్టువిలుకాడు, గరళకంఠుడు, గిరీశుడు, గుడాకేశుడు, గోకర్ణకుండలుడు, గోపతి, గోపాలుడు, చండీశుడు, చండుడు, చంద్రకళాధరుడు, చంద్రచూడుడు, చంద్రధరుడు, చంద్రమశ్శేఖరుడు, చంద్రశేఖరుడు, చంద్రాపీడుడు, చంద్రార్థచూడామణి, చంద్రార్థమౌళి, చంద్రిలుడు, చేకితానుడు, చేతనుడు, జటాచీరుడు, జటాజూటుడు, జటాఝాటధారి, జటాధరుడు, జయంతుడు, జలధితూణీరుడు, జీవనుడు, జ్వాలి, ఝర్ఝరి, తాండవప్రియుడు, త్రిధాముడు, త్రినయనుడు, త్రినేత్రుడు, త్రిపాత్తు, త్రిపురభేదకుడు, త్రిపురవైరి, త్రిపురాంతకుడు, త్రియంబకుడు, త్రిలోచనుడు, త్ర్యంగటముడు, త్ర్యంబకుడు, త్ర్యక్షుడు, దక్షజాపతి, దక్షాధ్వరధ్వంసి, దక్షిణామూర్తి, దహనాంబకుడు, దిగంబరుడు, దేవదేవుడు, దేవశ్రుతుడు, దేవేశుడు, ద్రాపుడు, ద్రుహిణుడు, ధరకార్ముకుడు, ధరణీశ్వరుడు, ధర్మవాహనుడు, ధూర్జటి, ధూర్తుడు, ధ్రువుడు, నందివర్ధనుడు, నకులుడు, నగచాపుడు, నటరాజు, నటేశ్వరుడు, నదీకాంతుడు, నభవుడు, నయనాయుధుడు, నర్తనప్రియుడు, నాగచూడుడు, నాగభూషణుడు, నాగహారుడు, నిటలాక్షుడు, నియంత, నిరంజనుడు, నిలింపనదీకిరీటుడు, నీలకంఠుడు, నీలకంధరుడు, నీలగళుడు, నీలగ్రీవుడు, నీలలోహితుడు, నృత్యప్రియుడు, నైకమాయుడు, నైకరూపుడు, పంచముఖుడు, పంచవక్త్రుడు, పంచవదనుడు, పంచాననుడు, పంచాస్యుడు, పరమేశుడు, పరమేశ్వరుడు, పరీణాహుడు, పశుపతి, పశువుడు, పశ్వత్పాలుడు, పాంశుచందనుడు, పింగ(లా)(ళా)క్షుడు, పింగళుడు, పింగాక్షుడు, పింగేక్షణుడు, పితృవనేచరుడు, పినాకపాణి, పినాకి, పుంగవకేతువు, పురందరుడు, పురభిత్తు, పురరిపువు, పురశాసనుడు, పురహరుడు, పురాంతకుడు, పురారాతి, పురారి, పురుషాస్థిమాలి, పుష్కరస్థపతి, పృశదంశుడు, ప్రభాకరుడు, ప్రమథనాధుడు, ప్రమథాధిపతి, ప్రమథాధిపుడు, ప్రాజంగము, ప్రాతమగవాడు, ప్రేతాస్థిదారి, ఫాలనేత్రుడు, ఫాలాభీలాంబకుడు, ఫాలుడు, బడరుడు, బాలవిధూత్తంసుడు, బాలేందుమౌళి, బీజవాహనుడు, బీజాధ్యక్షుడు, బుధ్నుడు, బ్రధ్నుడు, భగఘ్నుడు, భగాలి, భగుడు, భద్రేశుడు, భరువు, భర్గుడు, భర్గ్యుడు, భవానీపతి, భవుడు, భస్మాంగుడు, భానువు, భార్గవుడు, భాలచంద్రుడు, భాలదర్శనుడు, భాలాంకుడు, భాస్కరుడు, భీషణుడు, భువనేశ్వరుడు, భూతనాథుడు, భూతరాట్టు, భూతేశుడు, భూరి, భృంగీశుడు, భృగువు, భైరవుడు, మందరమణి, మదనరిపువు, మదనాంతకుడు, మదనారి, మనసిజమర్దనుడు, మరుద్భుక్కటకుడు, మలహరుడు, మల్లారి, మహాకాలుడు, మహాదేవుడు, మహానటుడు, మహేశానుడు, మహేశుడు, మహేశ్వరుడు, మారజిత్తు, మారరిపువు, మినుసికవలంతి, మినుసికవాడు, మిహిరాణుడు, మృడుడు, మృత్యుంజయుడు, మృత్యువంచకుడు, మేచకగ్రీవుడు, మేరుధ్వనుడు, మేరుధాముడు, యజ్ఞము, రాజధరుడు, రాజశేఖరుడు, రుద్రుడు, లలాటలోచనుడు, లలాటాక్షుడు, లింగమూర్తి, లేలిహాసుడు, వర్ధనుడు, వసుధారథుడు, వాజసనుడు, వామదేవుడు, వామార్ధజాని, వాముడు, వారుడు, విజయేశుడు, విధుడు, విభిన్నుడు, విరూపాక్షుడు, విలాసి, విలోహితుడు, విశాఖుడు, విశాలాక్షుడు, విశ్వనాథుడు, విశ్వమూర్తి, విశ్వాత్ముడు, విషకంఠుడు, విషధరుడు, విషమాక్షుడు, విషాంతకుడు, వృషధ్వజుడు, వృషపతి, వృషపర్వుడు, వృషభధ్వజుడు, వృషవాహనుడు, వృషాంకుడు, వృషాకపి, వేడిమికన్దొర, వేల్పుమలవింటిదొర, వైద్యనాథుడు, వ్యోమకేశుడు, శంకరుడు, శంకువు, శంభుడు, శక్రుడు, శతఘ్నుడు, శ(బ)(వ)రుడు, శమనరిపుడు, శరణ్యుడు, శర్వుడు, శశాంకమౌళి, శశిభూషణుడు, శశిభృత్తు, శశివకాళి, శశిశేఖరుడు, శాంబరీభిల్లుడు, శార్ఙ్గి, శాశ్వతుడు, శితికంఠుడు, శిపివిష్టుడు, శిరోమాలి, శీఘ్రియుడు, శూలధన్వుడు, శూలధరుడు, శూలధారి, శూలపాణి, శూలి, శైలధన్వుడు, శ్మశానవేశ్ముడు, శ్యామకంఠుడు, శ్రీకంఠుడు, శ్రీవర్ధనుడు, శ్వేతపింగలుడు, షడర్ధనేత్రుడు, షష్టిభాగుడు, సంఖ్యాసమాపనుడు, సంగ్రహుడు, సంధ్యావాటి, సంభగ్నుడు, సంయతుడు, సకల్పుడు, సత్కృతుడు, సదానందుడు, సదాశివుడు, సద్యోజాతుడు, సనాతనుడు, సభావనుడు, సమన్యుడు, సముద్రుడు, సర్గుడు, సర్వకరుడు, సర్వజ్ఞుడు, సర్వాంగుడు, సర్వాత్ముడు, సర్వేశ్వరుడు, సహస్రదుడు, సహస్రపాత్తు, సహస్రబాహు, సహస్రహస్తుడు, సహస్రాక్షుడు, సహాయుడు, సాంఖ్యముఖ్యుడు, సాంఖ్యుడు, సాంబుడు, సాధ్యఋషి, సారంగుడు, సారగ్రీవుడు, సావిత్రుడు, సింహగుడు, సింహదంష్ట్రుడు, సిద్ధయోగి, సిద్ధార్థుడు, సిద్ధిదుడు, సీరాయుధుడు, సుక్రతువు, సుగంధారుడు, సుగ్రీవుడు, సుచ్ఛత్రుడు, సుతీక్ష్ణదర్శనుడు, సుతీర్థుడు, సుదర్శనుడు, సునిశ్చలుడు, సుప్రతీకుడు, సుప్రసాదుడు, సుబలుడు, సుబాంధవుడు, సుమేరువు, సుయుక్తుడు, సురూపుడు, సువక్త్రుడు, సువర్చసుడు, సువర్ణరేతుడు, సువర్ణాక్షుడు, సువాసుడు, సువీజుడు, సుషాఢుడు, సుశారదుడు, సుస్వపనుడు, సూక్ష్మాత్మ, సూక్ష్ముడు, సూర్యుడు, సేనాకల్పుడు, సేనాపతి, సోముడు, స్కందుడు, స్తుతుడు, స్త్రీదేహార్థుడు, స్థాణువు, స్మరశాసనుడు, స్మరహరుడు, స్రువాహస్తుడు, స్వంజుడు, స్వయంభువుడు, స్వయంభూతుడు, స్వయంశ్రేష్ఠుడు, స్వస్తిదుడు, స్వామి, హంసుడు, హరకుడు, హరుడు, హాటకేశ్వరుడు, హిండుకుడు, హింస్రుడు, హిరణ్యకవచుడు, హిరణ్యబాహువు, హిరణ్యరేతసుడు, హిరణ్యవాహుడు, హీరుడు, హృత్వ, హేమకేశుడు, హైముడు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు