ఇంపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
నామవాచకము
వ్యుత్పత్తి
వ్యు. ఇంపు + ఉ. (కృ.ప్ర.)
 • ఇది ఒక మూలపదము
బహువచనం
రూ. ఇంబు, ఇమ్ము.

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

ఇష్టము/ వాంఛ

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
పర్యాయ పదాలు
అనుగు, అనురక్తి, అనురతి, అనురాగము, అభిమతి, అభిమానము, అరులు, , అర్మిలి, ఆదట, ఆప్యాయము, ఆబంధము, ఇంపు, ఎలమి, కూరిమి., గారాబము, గారము, గోము, , , నెనరు, నెమ్మి, నెమ్మిక, నెయ్యము, , ప్రణయము, , ప్రియత్వము, ప్రియతనము, ప్రీతి, ప్రేమము, మక్కువ, మచ్చిక , మమకారము, మమత, మారాము, మాలిమి, ముచ్చట, మురిపెము, ముసిమి, వలపు, వాత్సల్యము, , వ్యామోహము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

 1. అతడు పాడిన పాట వినుటకు చెవులకు ఇంపుగా వున్నది
 2. ఇంపు మొదలైన కృదంతములందేగాక 'ఏము వెలిగాగ మా తండ్రి కించునెట్లు
 3. ఒక సామెతలో పద ప్రయోగము: 'కండ్ల కింపైతే కడుపుకింపు
 4. "గీ. ...నలుని వరియింప గోరెడు నాకు నిప్పు, డింద్రుపలుకు లయుక్తంబు లింపు గావు." నైష. ౩,ఆ. ౧౩౧.
 5. ఇచ్ఛ."ఉ. ఓనితంబిని సుగంధి పటాభరణాదికంబు నీ, నెమ్మదికించెనో యనుడు నేడయినం బరికించితౌర నా, నెమ్మది యింపుగింపునని నీరజలోచన పల్కి వెండియున్‌." పర. ౩, ఆ.
 6. "చ. ...ఇనుడు కవుంగిలించుకొని యింపుగ మూర్కొని..." కాళిందీ. ౧,ఆ. ౨౩౭
 7. "గీ. ...నలుని వరియింపఁ గోరెడు నాకు నిప్పు, డింద్రుపలుకు లయుక్తంబు లింపు గావు." నైష. ౩,ఆ. ౧౩౧.

అనువాదాలు[<small>మార్చు</small>]

 • తమిళము;ఇనిమై.
 • ఇంగ్లీష్;(లైక్)like.Fulness, satisfaction, ease, Fondness, liking.
 • హింది;పసంద్.
 • కన్నడము:ಇಂಪು(ఇంపు)

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఇంపు&oldid=967069" నుండి వెలికితీశారు