fancy

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, తోచుట, తలచుట, యెంచుట, భావించుకొనుట.

  • I fancy so నాకు అట్లా తోస్తున్నది.
  • they fancied that he is goneవాడు పోయినాడనుకొన్నారు.

క్రియ, విశేషణం, యిచ్ఛించుట, ఆశించుట.

  • I fancy that horse.
  • ఆ గుర్రముమీద నాకు యిచ్ఛగా వున్నది.
  • such food as the appetite fanciesమనసుకు యింపైన ఆహారము.
  • a bird-fancier పక్షుల మీద పడి చచ్చేవాడు,పక్షుల మీద బలుపు గలవాడు.

నామవాచకం, s, imagination భావన, యెన్నిక, తలంపు, భావము.

  • they have a fancy that you are gone నీవు పోయినావనుకొన్నారు.
  • I have some fancy that I have seen this book before యీ పుస్తకమునునేను మునుపు చూచినట్టు తోస్తున్నది.
  • this is a mere or empty fancyయిది వట్టి భ్రమ.
  • a foolish fancy వెర్రి యోచన.
  • inclination మనసు, యిష్టము.
  • యిచ్ఛ, ఆశ.
  • have you any fancy for that house ఆ యిల్లేమైనా నీకు యిష్టమా.
  • having no fancy to do so అట్లా చేయడమునకు యిష్టములేనందున.
  • I have fancyno for that అది నాకు యిష్టము లేదు.
  • the horse does not strike my fancyగుర్రము నాకు యిష్టము లేదు.
  • she took a fancy to him అది వాణ్నివలచినది.
  • he has no fancy for food వాడికి అన్నము మీద యిష్టములేదు,బుద్ధి లేదు.
  • she wears a fancy dress దానికి యిష్టమైన వేషము వేసుకొంటున్నది.
  • అనగా కులాచా ర,మతాచారములకు విరుద్ధముగా దానికి మనసు వచ్చిన వేషము వేసుకొంటున్నది.
  • fancy work చిత్రపని, చిత్రవిచిత్రమైనపని.
  • a fancy ball ప్రతిమనిషిన్ని మారువేషములు వేసుకొనివచ్చే విందు.
  • a fancy man వలపుగాడు, సొగసుగాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fancy&oldid=931163" నుండి వెలికితీశారు