hand
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, a., అందుకొనుట, చేతయెత్తి యిచ్చుట.
- hand me that book ఆపుస్తకాన్ని యిట్లా అందియియ్యి.
- he handed her into the room దానికి చెయ్యి యిచ్చియింట్లోకి తీసుకొని వచ్చినాడు.
- they handed down the estate to him పరంపరగావాండ్ల ఆస్తి వాడికి వచ్చినది.
- the puranas have handed down this story యీ కథ పురాణాల క్రమముగా వచ్చినది.
- he handed the house over to me ఆ యింటిని నాపరము చేసినాడు.
- to hand up ఫిర్యాదు చేసుట.
నామవాచకం, s, చెయ్యి, హస్తము, కరము.
- I paid him the money with my own hand వాడికి ఆ రూకలు నా చేతులార చెల్లిస్తిని.
- they bound his hands behind his back వాణ్ని పెడ రెక్కలు విరిచి కట్టినారు.
- the letter was in my brother's hand i.e. his writing ఆ జాబు మా అన్న అక్షరాలు.
- he put his hand to the bond ఆ పత్రములో చేవ్రాలు చేసినాడు.
- witness my hand Rangaya రంగయ్య యెరుగుదను.
- or palm అరిచెయ్యి, కరతలము.
- the hollow of the hand పుడిసిలి.
- the hollow of the joined hands అంజలి.
- the hand of a clock గడియారపు ముల్లు, బహువచనం. ముండ్లు.
- he clapped his hands చేతులు తట్టినాడు.
- to cut off the hands మణికట్లను తెగకొట్టుట, చేతులను తీసివేసుట.
- (metaphorically) In this I see the hand of God యిందులో యీశ్వర ఘటన తెలుస్తున్నది, by the hand of Providence దైవ యత్నము చేత, దైవవశముగా, దైవాధీనముగా.
- this is the hand or finger of God యిది యీశ్వర తంత్రము, ఈశ్వరమాయ (Phrases,) a new hand కొత్త మనిషి, చెయి తిరగనివాడు.
- ten hands were employed in building it దాన్ని పది మంది కట్టుతూ వుండినారు.
- all hands were engaged in this business అందరు యీ పని మీద వుండినారు.
- this picture is painted by a celebrated hand యీ పఠమును వ్రాసినది మంచి గొప్ప చెయ్యి అనగా ప్రసిద్ధుడు.
- I have this news from a sure hand (Addision)నమ్మతగిన వాడి గుండా యీ సమాచారము విన్నాను.
- will you lend me a hand ? సహాయము చేస్తావా.
- he tried his hand at the work తన చేత అవుతున్నదో కాదో అని చేసి చూచినాడు.
- his hand is now in వాడికి యిప్పుడు చెయి తిరిగి వున్నది.
- when his hand was in వాడికి అందులో ప్రవేశము కలిగివుండినప్పుడు.
- when you have the pen in your hand నీవు పేనా పట్టి వున్నప్పుడు.
- the papers that are in my hands నా వద్ద వుండే కాగిదములు.
- I have the letter in my hand ఆ జాబు యిదుగో.
- I have the money in my hands (బహువచనం) ఆ రూకలు నా స్వాధీనములో వున్నవి, నా వశములో వున్నవి.
- bear a hand ! or make haste త్వరగా కాని, ఆలస్యము చేయవద్దు.
- hand over hand బిరబిర.
- the estate passed from hand to hand and at last came to him ఆ యాస్తి వాడి వాడి చేతిలోబడి తుదకు అతనికి చేరినది.
- the property changed hands ఆ సొత్తు వొకని చెయి విడిచి మరి వొకని చేతికి పోయినది.
- they came hand in hand చేతులు గూర్చుకొని వచ్చినారు.
- hand in hand with Telugu he read Tamil తెలుగు అరవము యేక కాలమందు చదివినాడు.
- they joined hand in hand that business ఆ పనిలో వొక చెయిగా వుండినారు.
- they are hand and glove with him వాండ్లున్ను అతడున్ను క్షీరోదక న్యాయముగా వున్నారు.
- he sought her hand దాన్ని పెండ్లి చేసుకో వలెనని యత్నము చేసినాడు.
- she bestowed her hand on him వాణ్ని పెండ్లాడినది.
- round hand or text hand బటువైన అక్షరములు, గుండక్షరములు.
- running hand గొలుసు అక్షరములు.
- Italian hand జిలుగు అక్షరములు.
- Roman hand పెద్దక్షరములు.
- short hand సంకేత లిపి.
- I had no hand in that business నేను ఆ జోలికి పోలేదు.
- the estate came into his hands ఆ యాస్తి వాడిపరమైనది.
- Hands off ! (Johnson) చెయితీ, చెయివిడుపు, విడిచిపెట్టు, అంటవద్దు.
- On the one hand on the other hand యీ పక్షమందు ఆ పక్షమందు.
- illness on one hand and hard work on the other వొక తట్టు రోగము వొక తట్టు కష్టము.
- the poems are all nonsense but on the other hand they teach us the grammar కావ్యములంతా వట్టి పిచ్చి అయితే అందుచేత మనకు వ్యాకరణము తెలుస్తున్నది.
- it is allowed on all hands that he is the heir అతడు వారసుదారుడై నట్టు వుభయులు వొప్పినారు.
- a hand at cards కాకితాళ ఆటలో వొకడి చేతికి వచ్చినకాకితాలు.
- a hand of four inches in measuring horses బెత్త.
- horse that is sixteen hands high అయిదు అడుగులు బెత్తెడు పొడుగు గల గుర్రము.
- he did not come into the court with clean hands తనయందు శుద్ధము లేక వుండగా వొకరి మీద కోర్టులో ఫిర్యాదు చేసినాడు.
- they got the upper hand of him వాణ్ని వంచించినారు.
- I have my hands full at present ప్రస్తుతము నాకు పని చాలా వున్నది, నా కిప్పుడు తీరదు.
- you must keep a strict hand over them నీవు వాండ్లకు కొంచెము బెదురుతో వుంచవలసినది.
- to lay hand on or seize పట్టుకొనుట, అటకాయించుట.
- the Bishop laid hands on the priest బిషపు వాడి తల మీద హస్తములను వుంచి మంత్రము చెప్పి పాదిరినిగా చేసినాడు.
- they laid violent hands upon him వాడి మీద దౌర్జన్యమును జరిగించినారు.
- If I can lay my hand on the book I will send it ఆ పుస్తకము చిక్కితే పంపిస్తాను.
- he put the last or finishing hand to the work ఆ పనిని తీర్పు చేసినాడు.
- he put the last or finishing hand to the statue జీవ రేఖలు తీర్చినాడు.
- at hand తటస్థమైన, దగ్గిరించిన, సన్నిహితమైన.
- winner was now at hand యింతలో చలి కాలము తటస్థించినది.
- I received it at his hands వాడి చేతిగుండా పుచ్చుకొన్నాను.
- I was before hand with him నేను వాడికంటే ముందు మించుకొన్నాను.
- he was behind hand with the money వాడికి రూకలు జాగ్రత కాలేదు.
- he was behind hand in preparing this దీన్ని సిద్ధపరచడములో తాత్సారముగా వుండినాడు.
- the minister took him by the hand and brought him forward మంత్రి అతణ్ని అభిమానించి ముందుకు తెచ్చినాడు.
- I sent the money by the hand of my brother నా తమ్ముని చేత రూకలు పంపించినాను.
- she brought the child up by hand ఆ బిడ్డను పోతపాలు పోసి పెంచినది.
- they live from hand to month నానాటికి తెచ్చుకొని గడుపుకొంటారు నానాటికి తెచ్చుకొని పొట్టపోసుకొంటారు.
- with a hand high hand డంభముగా, జంభముగా, తమాషాగా.
- the case in hand జరిగేవ్యాజ్యము.
- the work is still in hand ఆ పని యింకా తీరలేదు.
- he took the business in hand ఆరంభించినాడు, మొదలుపెట్టినాడు.
- he left the case in my hands ఆ వ్యాజ్యాన్ని నాకు వొప్పించినాడు.
- he came sword in hand ఖడ్గహస్తుడై వచ్చినాడు.
- payment in hand రొక్కరూకలు.
- they are in his hands నా వశములో వుండే యిల్లు.
- I fell into his hands వాడి చేతిలో చిక్కినాను.
- heplayed into the enemies hand శత్రువులకు అనుకూలముగా నటించినాడు.
- he took the law into his own hands అధికారిచేయవలసిన శిక్ష ను తానుగా చేసినాడు.
- he delivered it into their hands దాన్ని వాండ్లకు వొప్పించినాడు.
- he got the house into his own hands ఆ యింటిని తన స్వాధీనము చేసుకొన్నాడు.
- off hand తక్షణము, నిరాయాసముగా, లటక్కున.
- he did the business off hand ఆ పనిని ధారాళముగా చేసినాడు.
- off hands ! చెయితీ తాకక, I will take the horse off your hands ఆ గుర్రము యొక్క తొందర నీకేల నేను పెట్టుకొంటాను.
- those goods are still on hand ఆ సరుకులు యింకా విక్రయము కాలేదు.
- the estate is still on his hands ఆ సొత్తులు యింకా విక్రయము కాలేదు.
- he has two daughters on his hand s వాడు యింకా యిద్దరు కూతుండ్లకు పెండ్లి చేయవలసివున్నది.
- my son died and left a widow and two children on my hands నా కొమారుడు, పెండ్లాన్నిన్ని యిద్దరు బిడ్డలునున్ను నాకాళ్లకట్టి చచ్చినాడు.
- the time hung heavy on his hands వాడికి ప్రొద్దుపోలేదు.
- the work I have on hand యిప్పుడు నేను చూస్తలూ వుండే పని.
- there is much work on hand చేయవలసిన పని చాలా వున్నది.
- an underhand business కుట్ర, పితలాటకము.
- he did this in an underhand manner కృత్రిమముగా చేసినాడు.
- his letter came to hand వాడి జాబు చేరినది.
- they fought hand to hand చెయిచెయి కలిపి పోట్లాడినారు.
- he found it was done to his hands వాడు చూచేటప్పటికి సిద్ధము అయి వుండినది.
- why should you translate it ? it is translated to your hands అది భాఠాంతరమైన సిద్ధముగా వుండగా భాషాంతరము చేయవలసిన శ్రమ నీకెందుకు.
- why should you fight with him ? he is vaniquished to your hands వోడిపోయిన వాడిమీద యుద్ధ మెందుకు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).