mean
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, and v. n.
- తలచుట, యెంచుట, భావించుకొనుట, అర్థమౌట.
- he knows perfectly well what I mean నా తాత్పర్య మేమిటిదో వాడికి బాగా తెలుసును.
- "Sila" means stone శిల అనగా రాయి.
- by these words he means that they are gone యీ మాటలచేత వారు పోయినారని భావిస్తాడు.
- do they mean me? నన్ను గురించి అన్నారా.
- where is he, (I mean the writer?) వాడెక్కడ, అనగా రైటరు.
- he (meaning my brother) అతడు అనగా మా యన్న.
- do you mean to go there? అక్కడికి పోవలెనని వున్నాను.
- do you mean to kill me? నీకు నన్ను చంపవలెననిభావమా.
- what can he mean by doing so? అట్లా చేయడములో వాడి భావమెట్టిదో.
- a well mean man సద్భావము గలవాడు.
నామవాచకం, s, or average సరాసరి. నామవాచకం, s, always plu.
- Means మధ్యమస్థితి, మధ్యమావస్థ, మితము, సాధనము, ఉపాయము, కారణము, బండోరము.
- by means of hisbrother తమ్ముని ద్వారా, తమ్ముని మూలకముగా
- by means of other persons అన్యుల ద్వారా.
- by this means యిందు వల్ల.
- by any means యెట్లాగైనా.
- he slew them by means of poison విషప్రయోగము చేశి చంపినాడు.
- what means have you of going? I have a horse, నీకు పొయ్యేటందుకు యేమి సాధనము వున్నది, గుర్రము వున్నది.
- by fair means or foul he got the money from them న్యాయముగానో, లేక, అన్యాయముగానో ఆ రూకలను రాబట్టుకొన్నాడు.
- he got up by means of a rope తాడు పట్టుకొని పైకి యెక్కినాడు.
- he used this letter as a means of getting the money ఆ రూకలను తీసుకోవడానకు యీ జాబును సాధనముగా చేసినాడు.
- go there by all means అక్కడికి అగత్యముపో.
- I could by no means find out what he meant వాడి అభిప్రాయము యెట్టిదో నాకు యెంత మాత్రము తెలియలేదు.
- he can by no means come now వాడు యిప్పుడు యెంత మాత్రము రాలేడు.
- be liberal when you have the means సాగినప్పుడు ధర్మము చేసుకో.
- he is a man of small means వాడికి దుడ్డులేదు.
- he who has no means of subsistence కూటికి లేనివాడు.
- he is a man of ample means నిండా భాగ్యవంతుడు.
- he was living on his own means తన చేతిదుడ్డు ఖర్చు చేసుకొని భోజనము చేస్తూ వుండినాడు.
విశేషణం, నీచమైన, తుచ్ఛమైన, అల్పమైన, హీనమైన, సామాన్యమైన.
- In the mean time or mean time or in the mean while or mean while యింతలో, అంతట, యీనడమ.
- In the mean time I am much obliged to you మెట్టుకు తమ వుపకారము.
- or, midmost నడిమి, మధ్యవుండే.
- a mean quantity in mathematics అంతరము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).