బ్రహ్మ

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
కర్ణాటకలోని హళిబీడులో ఉన్న బ్రహ్మ శిల్పం

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

త్రిమూర్తులలో ఒక్కఁడు.

  • నలువ
  • సృష్టికర్త
  1. తొల్లి కల్పావసానమున సమస్తము జలార్ణవము అయి అంతట అంధకారబంధురముగ ఉండువేళ ఆజలమధ్యమున శ్రీమన్నారాయణమూర్తి వటపత్రశాయియై యోగనిద్రను తేలుచు ఉండి వరాహరూపమును ఒంది తన దంష్ట్రాగ్రమున భూమిని జలమునందుండి పైకి ఎత్తి నిలుపఁగా ఇతఁడు ఆపంకజోదరుఁడు అగు నారాయణుని గర్భమున ప్రవేశించి అందు ఉండు బ్రహ్మాండముల తత్వమును ఎఱిఁగి ఆదేవుని నాభికమలమునందుండి వెడలివచ్చి జగత్సృష్టి ఒనర్ప ఆరంభించెను. కనుక ఇతనికి పంకజభవుడు అను నామము కలిగెను.

ఇతఁడు చతుర్ముఖుఁడు. తొలుత ఇతనికి అయిదు ముఖములు ఉండెను. ఒక కాలమునందు త్రిమూర్తులు కొలువుతీరి ఉండఁగా అచ్చటికి పార్వతీదేవి వచ్చి పంచముఖులు అగు శివబ్రహ్మలు ఇరువురిని చూచి ఇతఁడు శివుఁడు ఇతఁడు బ్రహ్మ అని తెలిసికోలేక పిమ్మట శివుని కనుసైగచేత ఎఱిగి చేరఁబోయెను. అప్పుడు శివుడు తన భార్యకు ఇంత భ్రమపుట్టుటకు కారణము బ్రహ్మకును అయిదు తలలు ఉండుటయె కదా అని అతనితలలో ఒకటిని శివుడు తీసివేసెను. అంత బ్రహ్మ అలిగి శివుడు కాపాలికత్వమును చెంది భిక్షాటనము చేయునట్లు శపించెను. ఆబ్రహ్మహత్యాపాపము పోవుటకై విష్ణువుయొక్క ఉపదేశమున శివుడు తీర్థయాత్ర చేసెను. అటుల యాత్రచేయుచు కాశిక్షేత్రమునకు రాఁగా అచట ఆపాపమువలన విముక్తుఁడు అయ్యెను.

ఇతని వ్యాపారము సృష్టిచేయుట. తొలుత ఇతనికి అనేకులు మానసపుత్రులు కలిగిరి. వారిలో తొమ్మండ్రు ప్రజాసృష్టికి కారణభూతులు అయి నవబ్రహ్మలు లేక నవ ప్రజాపతులు అనఁబడిరి. వారు మరీచి, అత్రి, అంగిరసుఁడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వసిష్ఠుడు, దక్షుడు అనువారు. తక్కిన మానసపుత్రులలో సనకుడు, సనందనుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు, బుభుడు, నారదుడు, హంసుడు, అరుణి, యతి మొదలు అగువారు ముఖ్యులు. వీరు అందఱును ఊర్ధ్వరేతస్కులు అయి సృష్టియందు ఇచ్ఛలేక జన్మము మొదలు జ్ఞానులై తిరుగుచు ఉందురు.

బ్రహ్మయొక్క ఛాయవలన కర్దముడు పుట్టెను. భ్రూమధ్యమువలన అర్ధనారీశ్వరుఁడు అగు రుద్రుఁడు పుట్టెను.

ఈ ప్రజాపతుల యొక్కయు, మహర్షుల యొక్కయు ఉత్పత్తి పలువిధములుగ చెప్పుదురు. శ్రీమద్భాగవతమున ఉన్నరీతిని బ్రహ్మయొక్క అంగుష్ఠమున దక్షుఁడును, నాభిని పులహుఁడును, కర్ణముల పులస్త్యుఁడును, త్వక్కున భృగువును, హస్తమున క్రతువును, ఆస్యమున అంగిరసుఁడును, ప్రాణమున వసిష్ఠుఁడును, మనమున మరీచియు, కన్నులయందు అత్రియు పుట్టిరి. మఱియు నారదుఁడు ఊరువులను, దక్షిణస్తనమువలన ధర్మమును, వెన్నువలన అధర్మ మృత్యువులును, ఆత్మను కాముఁడును, భ్రూయుగళమున క్రోధుఁడును పుట్టినట్లు చెప్పి ఉన్నది. ఇదిగాక బ్రహ్మ తన దేహమునుండి సరస్వతి జనింపఁగా ఆమెను కని విభ్రాంతిని పొంది కామాతురుఁడు అయి భార్యగా చేసికొనెను.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

బ్రహ్మరాత తప్పింప ఎవరి తరము.

  • బ్రహ్మదేవుని ఆలయాలు అరుదుగా ఉంటాయి. అవి ఉత్తర ప్రదేశ్ లోని బఠూర్, రాజస్థాన్ రాష్ట్రంలో బార్మర్ జిల్లాలో ఉన్న బలోత్రా, ఇండోనేషియా దేశంలో బాలి లోని మదర్ టెంపుల్ ఆఫ్ బెసకిన్, ఇండోనేషియా దేశం లోని యోగ్యకర్తా లోని పద్మనాభన్ ఆలయము.
  • ఒక సామెతలో పద ప్రయోగము: బ్రహ్మ కైన పుట్టు రిమ్మ తెగులు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బ్రహ్మ&oldid=967266" నుండి వెలికితీశారు