బ్రహ్మ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- బ్రహ్మ నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- బ్రహ్మ త్రి మూర్తులలో ఒకరైన సృష్టి కర్త.
- విష్ణువు
- బ్రాహ్మణుడు
- ఒక ఋత్విజుడు
- పరమాత్మ
- వేదము
- తపము
- ఒక గ్రహయోగము
త్రిమూర్తులలో ఒక్కఁడు.
- నలువ
- సృష్టికర్త
- తొల్లి కల్పావసానమున సమస్తము జలార్ణవము అయి అంతట అంధకారబంధురముగ ఉండువేళ ఆజలమధ్యమున శ్రీమన్నారాయణమూర్తి వటపత్రశాయియై యోగనిద్రను తేలుచు ఉండి వరాహరూపమును ఒంది తన దంష్ట్రాగ్రమున భూమిని జలమునందుండి పైకి ఎత్తి నిలుపఁగా ఇతఁడు ఆపంకజోదరుఁడు అగు నారాయణుని గర్భమున ప్రవేశించి అందు ఉండు బ్రహ్మాండముల తత్వమును ఎఱిఁగి ఆదేవుని నాభికమలమునందుండి వెడలివచ్చి జగత్సృష్టి ఒనర్ప ఆరంభించెను. కనుక ఇతనికి పంకజభవుడు అను నామము కలిగెను.
ఇతఁడు చతుర్ముఖుఁడు. తొలుత ఇతనికి అయిదు ముఖములు ఉండెను. ఒక కాలమునందు త్రిమూర్తులు కొలువుతీరి ఉండఁగా అచ్చటికి పార్వతీదేవి వచ్చి పంచముఖులు అగు శివబ్రహ్మలు ఇరువురిని చూచి ఇతఁడు శివుఁడు ఇతఁడు బ్రహ్మ అని తెలిసికోలేక పిమ్మట శివుని కనుసైగచేత ఎఱిగి చేరఁబోయెను. అప్పుడు శివుడు తన భార్యకు ఇంత భ్రమపుట్టుటకు కారణము బ్రహ్మకును అయిదు తలలు ఉండుటయె కదా అని అతనితలలో ఒకటిని శివుడు తీసివేసెను. అంత బ్రహ్మ అలిగి శివుడు కాపాలికత్వమును చెంది భిక్షాటనము చేయునట్లు శపించెను. ఆబ్రహ్మహత్యాపాపము పోవుటకై విష్ణువుయొక్క ఉపదేశమున శివుడు తీర్థయాత్ర చేసెను. అటుల యాత్రచేయుచు కాశిక్షేత్రమునకు రాఁగా అచట ఆపాపమువలన విముక్తుఁడు అయ్యెను.
ఇతని వ్యాపారము సృష్టిచేయుట. తొలుత ఇతనికి అనేకులు మానసపుత్రులు కలిగిరి. వారిలో తొమ్మండ్రు ప్రజాసృష్టికి కారణభూతులు అయి నవబ్రహ్మలు లేక నవ ప్రజాపతులు అనఁబడిరి. వారు మరీచి, అత్రి, అంగిరసుఁడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వసిష్ఠుడు, దక్షుడు అనువారు. తక్కిన మానసపుత్రులలో సనకుడు, సనందనుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు, బుభుడు, నారదుడు, హంసుడు, అరుణి, యతి మొదలు అగువారు ముఖ్యులు. వీరు అందఱును ఊర్ధ్వరేతస్కులు అయి సృష్టియందు ఇచ్ఛలేక జన్మము మొదలు జ్ఞానులై తిరుగుచు ఉందురు.
బ్రహ్మయొక్క ఛాయవలన కర్దముడు పుట్టెను. భ్రూమధ్యమువలన అర్ధనారీశ్వరుఁడు అగు రుద్రుఁడు పుట్టెను.
ఈ ప్రజాపతుల యొక్కయు, మహర్షుల యొక్కయు ఉత్పత్తి పలువిధములుగ చెప్పుదురు. శ్రీమద్భాగవతమున ఉన్నరీతిని బ్రహ్మయొక్క అంగుష్ఠమున దక్షుఁడును, నాభిని పులహుఁడును, కర్ణముల పులస్త్యుఁడును, త్వక్కున భృగువును, హస్తమున క్రతువును, ఆస్యమున అంగిరసుఁడును, ప్రాణమున వసిష్ఠుఁడును, మనమున మరీచియు, కన్నులయందు అత్రియు పుట్టిరి. మఱియు నారదుఁడు ఊరువులను, దక్షిణస్తనమువలన ధర్మమును, వెన్నువలన అధర్మ మృత్యువులును, ఆత్మను కాముఁడును, భ్రూయుగళమున క్రోధుఁడును పుట్టినట్లు చెప్పి ఉన్నది. ఇదిగాక బ్రహ్మ తన దేహమునుండి సరస్వతి జనింపఁగా ఆమెను కని విభ్రాంతిని పొంది కామాతురుఁడు అయి భార్యగా చేసికొనెను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- తెలుగు: అంచగుఱ్ఱపుజోదు, అంచబాబా, అంచయేనుగుమావంతు, అంచ(రౌ)(రవు)తు, ఉడ్డమోములవేలుపు, చదువులదేవర, చదువులముదుకడు, చదువులవేల్పు, జేజేపెద్ద, తమ్మిచూలి, తమ్మిపుట్టు, తాతవేల్పు, తెఱగంటిపెద్ద, తొలువేలుపు, నలుమొగంబులప్రోడ, నలుమోమయ్య, నలువ, నల్మోముదేవర, నల్వ, నీటిపుట్టుగుపట్టి, పసిండిబొజ్జదొర, పెద్దవేలుపు, పొంబోరవేల్పు, పొక్కిలిచూలి, ప్రాజదువులవేల్పు, బంగారుకడుపువాడు, బమ్మ, ముదురజదువులబాపన, మొదటివేల్పు, వేదపుగనివేల్పు, వేలుపగమికాడు, వేలుపులపెద్ద, వేల్పుతాత, వే(ల్పు)(లుపు)బెద్ద, వేల్పుబెద్దన, వేల్పుమిన్న
- సంస్కృతం: అం(క)(గ)తి, అంబుజగర్భుడు, అంబుజాసనుడు, అంబురుహగర్భకుడు, అంభోజజని, అంభోజజన్ముడు, అంభోజజుడు, అంభోజయోని, అగ్రజన్ముడు, అఘ్న్యుడు, అజితుడు, అజుడు, అబ్జజుడు, అబ్జభవుడు, అబ్జయోని, అరవిందసదుడు, ఆత్మభువు, ఆత్మయోని, ఆత్మసంభవుడు, ఆదికవి, కం(జ)(జా)రుడు, కంజుడు, కజాతుడు, కమలజన్ముడు, కమలజుడు, కమలాసనుడు, కర్త, కుశేశయాసనుడు, గాంగేయగర్భుడు, చతురాననుడు, చతురాస్యుడు, చతుర్ముఖుడు, జగత్కర్త, జన్నిగట్టు, జన్యువు, జలజాసనుడు, తాత, తామరచూలి, దివ్యోపపాదుకుడు, దుగినుడు, దేవదేవుడు, ద్రుహిణుడు, ధాత, ధారణుడు, ధ్రువుడు, నరుడు, నలినజుడు, నాభిజన్ముడు, నాభిజుడు, నాళీకజుడు, నాళీకాసనుడు, నీరజాతసంభవుడు, నీరేరుహాద్భూతుడు, పంకజజన్ముడు, పద్మగర్భుడు, పద్మజాతుడు, పద్మజుడు, పద్మభవుడు, పద్మయోని, పద్మలాంఛనుడు, పద్మసంభవుడు, పద్మాసనుడు, పద్మోద్భవుడు, పరమేష్టి, పరమేష్టుడు, పరేశుడు, పాశపాణి, పాశభృత్తు, పాశి, పింగళుడు, పితామహుడు, పితువు, పూర్వదేవుడు, పూర్వపురుషుడు, ప్రజాపతి, ప్రపితామహుడు, బహురేతసుడు, బిసరుహాసనుడు, బొమ్మ, భవాంతకృత్తు, భామమోమున వ్రేలురూపము, భూతాత్ముడు, మంజుప్రాణుడు, మర్కుడు, మృగయుడు, లోకేశుడు, వనజజుడు, వనజభవుడు, వాక్పతి, వాగీశుడు, వాఙ్మనఃకాంతుడు, వాణీరమణుడు, వారిజభ్రూణుడు, విధాత, విధాతృడు, విధి, విధుడు, విరించనుడు, విరించి, విరించుడు, విశ్వయోని, విశ్వరేతసుడు, విశ్వసృక్కు, విస్వసృజుడు, విశ్వస్రష్ట, విశ్వాత్ముడు, వృకోదరుడు, వేదగర్భుడు, వేదనిశ్వాసుడు, వేది, వేధ, శతదళసంభవుడు, శతధృతి, శతానందుడు, శలుడు, శుభ్రి, శ్వేతపత్రరథుడు, సంజుడు, సంధ్యారాముడు, సనతుడు, సనత్తు, సనాతనుడు, సప్తాత్ముడు, సరసిజభవుడు, సరోజయోని, సరోజాసనుడు, సర్వతోముఖుడు, సహస్రపాత్తు, సాత్వికుడు, సారసగర్భుడు, సుధావర్షి, సురజ్యేష్ఠుడు, సృష్టికర్త, స్రష్ట, స్వంజుడు, స్వయంభువు, స్వయంభువుడు, హంసరథుడు, హంసవాహనుడు, హాలాహలము, హాటకగర్భుడు, హిరణ్యగర్భుడు, హిరణ్మయుడు
- సంబంధిత పదాలు
- బ్రహ్మదేవుడు
- నవబ్రహ్మలు : భృగువు, పులస్త్యుడు, పులహుడు. అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి.
- బ్రహ్మము
- బ్రహ్మకమ్మి
- బ్రహ్మచర్యము
- బ్రహ్మచారి
- బ్రహ్మచారిణి
- బ్రహ్మదారువు
- బ్రహ్మహత్య
- బ్రహ్మత్వము
- బ్రహ్మసాయుజ్యము, బ్రహ్మభూయము or బ్రహ్మసాయుజ్యము
- బ్రహ్మదండి
- బ్రహ్మనాడి
- బ్రహ్మనాభుడు
- బ్రహ్మపుత్రము
- బ్రహ్మపుత్రుడు
- బ్రహ్మబంధువు
- బ్రహ్మబిందువు
- బ్రహ్మభూతుడు
- బ్రహ్మయజ్ఞము
- బ్రహ్మరథము
- బ్రహ్మరంధ్రము
- బ్రహ్మరాకాసి చెట్టు
- బ్రహ్మరాక్షసి
- బ్రహ్మరాక్షసుడు
- బ్రహ్మలిపి, బ్రహ్మవ్రాత లేదా బ్రహ్మవ్రాలు
- బ్రహ్మవాది
- బ్రహ్మ విద్వాంసుడు
- బ్రహ్మవేళ
- బ్రహ్మసూత్రము
- బ్రహ్మసువు
- బ్రహ్మస్వము
- బ్రహ్మాంజలి
- బ్రహ్మాండము
- బ్రహ్మణి
- బ్రహ్మానందము
- బ్రహ్మరణ్యము
- బ్రహ్మవర్తము
- బ్రహ్మాసనము
- బ్రహ్మ్యము
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]బ్రహ్మరాత తప్పింప ఎవరి తరము.
- బ్రహ్మదేవుని ఆలయాలు అరుదుగా ఉంటాయి. అవి ఉత్తర ప్రదేశ్ లోని బఠూర్, రాజస్థాన్ రాష్ట్రంలో బార్మర్ జిల్లాలో ఉన్న బలోత్రా, ఇండోనేషియా దేశంలో బాలి లోని మదర్ టెంపుల్ ఆఫ్ బెసకిన్, ఇండోనేషియా దేశం లోని యోగ్యకర్తా లోని పద్మనాభన్ ఆలయము.
- ఒక సామెతలో పద ప్రయోగము: బ్రహ్మ కైన పుట్టు రిమ్మ తెగులు