అంబరము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకము
ఈ మాటకు రెండు అర్థాలున్నాయి
- వ్యుత్పత్తి
- సంస్కృతము अम्बर నుండి పుట్టినది.
- బహువచనం
లేదు. ఆకాశము అంటేనే ఏకత్వము.(నిత్య ఏకవచనము)
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- ఆకాశము పంచభూతములలో ఒకటి.మిగిలినవి గాలి, నీరు, భూమి, అగ్ని
- వస్త్రము: అంబరము అంటే కప్పి ఉంచునది. అందువలనే పట్టు వస్త్రాన్ని పీతాంబరం అని అంటాము.
3. వ్యసనము; 4. సుగంధద్రవ్యము.
- సం.వి.అ.న./ 1. ఆకాశము.2. శూన్యము.3. వస్త్రము.4. కుంకుమపువ్వు.5. అభ్రకము.6. జూదము మొదలైన వ్యసనము. 7. దూది.6. అంబరు అను పరిమళ ద్రవ్యము.వ్యు. అంబ + రా + క. (కృ.ప్ర.) ధ్వని నొసగునది. ఆకాశము శబ్దగుణకము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- ఆకాశము
- వస్త్రము
- సంబంధిత పదాలు
- పర్యాయ పదములు
అంతరిక్షము, అంబరము, అంబుదాయనము, అంభోభృత్పథము, అక్షరము, అధ్వము, అనంగము, అనంజనము, అనంతము, అనంశము, అభ్రపథము, అభ్రము, అంతరిక్షము, ఆకసము, ఆష్ట్రము, ఉడుగణవీథి, ఉడుపథము, ఉప్పరము, ఊర్ధ్వవర్త్మము, కఱివేల్పుహజ్జ, కింజల్కము, ఖంబు, ఖజాకము, ఖతలము, ఖము, గగనము, గాడుపుతండ్రి, ఘనాశ్రయము, చండభమార్గము, చదలు, చరాచరము, చుక్కలతెరువు, చుక్కలత్రోవ, జేజేవీథి, తారాధ్వము, తారాపథము, తారావర్త్మము, తెఱగంటిత్రోవ, దివము, దివి, దివ్యము, దేవవర్త్మము, ద్యువు, ద్యో, ద్రాపము, ధత్రము, ధృత్వము, ధ్రువము, నక్షత్రపథము, నక్షత్రమార్గము, నభము, నభసము, నభస్సు, నాకము, నింగి, నిరాకారము, నిర్మోకము, నీరూపము, పుణ్యము, పుష్కరము, బయలు, బర్హిస్సు, బహుళము, బైలు, భగము, భువనము, భువస్సు, భ్రాష్ట్రము, మబ్బుత్రోవ, మిను, మిన్ను, మిన్నులు, మేఘద్వారము, మేఘపథము, మేఘమార్గము, మేఘవర్త్మము, మేఘవేశ్మము, మొగిలుత్రోవ, మొగిలుదారి, మొగులుదారి,రిక్కదారి, రోదసి, రోదోంతరము, వాయువర్త్మము, వాయ్వాస్పదము, విను, విన్ను,విభువు, వియత్తలము, వియత్తు, విష్ణుపదము, విహాయసము, వెన్నునడుగు, వేలుపుతెరువు, వేలుపుత్రోవ, వ్యోమము, శబ్దగుణము, శుషిరము, శూన్యము, సంపూర్ణము, సత్పథము, సన్మార్గము, సర్మము, సర్వతోముఖము, సావిత్రివర్త్మము, సుమము, సురవర్త్మము, సూమము, సైరిభము, సోమధార, స్తీర్వి, స్పర్శము, హరితాలి, హరిపదము
- వ్యతిరేక పదాలు
చిత్ర మాలిక
[<small>మార్చు</small>]-
అంబరము
-
వస్త్రము
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆకాశము
- పంచభూతాలలో అంబరము(ఆకాశము) ఒకటి.
- "అటజని గాంచె భూమిసురు డంబర చుంబి సురస్సర జ్ఝరీ.." హిమాలయాలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయని మనుచరిత్రములో అల్లసాని పెద్దన చేసిన వర్ణన.
- వస్త్రము
- ప్రముఖ శ్లోకం.."శుక్లాంబరధరం, విష్ణుం, శశివర్ణం, చతుర్భుజం.."
అనువాదాలు
[<small>మార్చు</small>]
|
|